తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతుంది. డీఎంకేలో మరో యువ నాయకుడ్ని ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీలో అన్నామలై లాంటి యువ నాయకులు రాజకీయాల్లో దూసుకుపోతున్నారు.
CM Stalin: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. 1974లో శ్రీలంకకు భారత్ అప్పగించిన కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపణలు చేశారు.
Kallakurichi Illicit Liquor: తమిళనాడు రాష్ట్రంలో కల్తీసారా ఘటన అత్యంత విషాదం గా మారింది. కల్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగిన ఘటనలో ఇప్పటి వరకు 29 మందికి చేరింది మృతుల సంఖ్య.. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
MK Stalin: తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ బీజేపీ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే సీఏఏని తమ రాష్ట్రంలో అమలు చేయమని డీఎంకే చెబుతున్న నేపథ్యంలో.. బీజేపీ సీఏఏతో ఆగడని, దాని తరుపరి లక్ష్యం వివిధ భాషల మాట్లాడే ప్రజలే అని ఆయన ఆరోపించారు. బీజేపీ భవిష్యత్తులో వీటికి సంబంధించిన చట్టాలను తీసుకువస్తుందని ఆయన అన్నారు.
సంక్రాంతి పండగకు తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ఆరంభమయ్యాయి. ఈ జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఒక సంప్రదాయక క్రీడ.. దీంట్లో ఎద్దులకు మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది.
Tamil Nadu: తమిళనాడులో తొలిసారిగా ముగ్గురు మహిళలు ఆలయ పూజారులుగా మారారు. కులాల అడ్డుగోడలను ఛేదించి దేవుడి గర్భగుడిలోకి ప్రవేశించి లింగసమానత్వాన్ని తీసుకురానున్నారు. దేవుడి సేవ చేసుకునే భాగ్యం కొన్ని కులాలకే కాదు అందరికి ఉందనే నిజాన్ని చాటి చెప్పేందుకు ఈ ముగ్గురు మహిళలు సిద్దమయ్యారు. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే యువతులు తమిళం, సంస్కృతం చదువుతూ శ్రీరంగం ఆలయంలో ఒక ఏడాది కోర్సును పూర్తి చేశారు. Read Also: Sabarimala: శబరిమల యాత్రికులకు మార్గదర్శకాలు జారీ…
MK Stalin: తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన ‘సనాతన’ వ్యాఖ్యలు దేశంలో దుమారాన్ని రేపాయి. బీజేపీతో పాటు పలు హిందూ సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమిలోని టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు నేరుగా ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించకుండా, ప్రతీ మతాన్ని గౌరవించాలని చెబుతున్నాయి.
Tamilisai Soundararajan: సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇప్పటికే బీజేపీ డీఎంకే పార్టీ, ఉదయనిధి, సీఎం స్టాలిన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరిగా డీఎంకేపై విరుచుకుపడుతున్నారు. ఇండియా కూటమిలో డీఎంకే పార్టీ కూడా ఉండటంతో ఇండియా కూటమి తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Tamil Nadu:తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు క్యాబినెట్ నుంచి మంత్రి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన మరోసారి గవర్నర్, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ఘర్షణకు కారణం కాబోతోంది.