ప్రతీకార రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తమిళనాడు. గత నలబై ఏళ్ల నుంచి తమిళ నాట రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కానీ కొత్త సీఎం దానికి ముగింపు పలికినట్టే కనిపిస్తోంది. పనికి రాని పనులు మాని రాష్ట్ర పురోగతిపై ఫోకస్ పెట్టారు సీఎం ఎం కే స్టాలిన్. ప్రస్తుతం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజకీయ సంచలనంగా మారుతోంది. అదే సమయంలో ఆయనపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై జనసేనాని పవన్కళ్యాణ్ అభినందనల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీసుకుంటున్న చర్యలు అందరికీ ఆదర్శప్రాయంగా మారాయి. ఇటీవల కాలంలో ఆయన చేసిన కామెంట్స్ లో అసెంబ్లీలో ఎవరికైనా పొగిడే ఉద్దేశం ఉంటే మానుకోవాలని, అలాంటి ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే బ్యాగుల పై రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు ఉండగా, అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాగులపై ఫోటోలు మార్చడానికి చాలా ఖర్చు అవుతుందని,…
ఎక్కడైనా ముఖ్యమంత్రిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించడం సర్వసాధారణం.. సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కడబడితే అక్కడ మన నేతలు మాట్లాడడం చూస్తుంటాం.. ఇక, అసెంబ్లీలో సీఎం ఎదుటే.. పొగడ్తలు ఎన్నోసార్లు లైవ్‌లో చూసిఉంటారు.. కానీ, తమిళనాడు సీఎం స్టైలే వేరు.. శాసనసభలో మైకు దొరికిందే తడవుగా తనను పొగడ్తలతో ముంచెత్తుతున్న ఎమ్మెల్యేలను సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఓ ఎమ్మెల్యే తనను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.…
ఇంకా అనుకున్న స్థాయిలో కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో తమిళనాడులో మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించింది ప్రభుత్వం.. ఇప్పటి వరకు లాక్‌డౌన్ ఆంక్షలు ఈ నెల 7వ తేదీ వరకు అమల్లో ఉండగా.. జూన్ 14 ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకించారు.. అయితే, పాజిటివ్ కేసుల ఆధారంగా.. ప్రాంతాల వారీగా సడలింపులు ఇచ్చింది సర్కార్.. కోవిడ్ కేసులు తగ్గిన చెన్నై, ఉత్తర మరియు దక్షిణ తమిళనాడు జిల్లాలకు ఎక్కువ సడలింపులు…
కరోనాతో తల్లిదండ్రులు, సంరక్షలను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్… కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నట్టు ప్రకటించారు.. 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ మొత్తాన్ని వడ్డీతో సహా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక, ఆ చిన్నారులకు స్కూల్, కాలేజ్, గ్రాడ్యుయేషన్ వరకు విద్యా మరియు వసతి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్న సీఎం స్టాలిన్.. అలాంటి అనాథ…
కరోనా సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని రాష్ట్రాలను మాత్రం ఇంకా టెన్షన్ పెడుతూనే ఉంది.. దీంతో.. కరోనా కట్టడికి కోసం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నాయి ఆయా రాష్ట్రాలు.. తాజాగా, తమిళనాడు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించింది.. జూన్ 7 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది తమిళనాడు సర్కార్.. ప్రస్తుత లాక్‌డౌన్ కు ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. నిత్యావసరాలకు సంబంధించిన దుకాణాలు ఉదయం 7 గంటల…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు మహమ్మారి బారినపడ్డారు.. ఇక, వందలాది మంది ప్రాణాలు వదిలారు.. అయితే, తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం ఎంకే స్టాలిన్.. కరోనాతో ఎవరైనా గుర్తింపు పొందిన జర్నలిస్టు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.. అంతేకాదు.. కరోనా సమయంలో.. జర్నలిస్టులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.2000 నుంచి రూ.5 వేలకు పెంచారు..…
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో తిరుగులేని విజయాన్ని అందుకున్న డీఎంకే నేత స్టాలిన్.. సీఎంగా పగ్గాలు చేపట్టారు.. అప్పటి నుంచి పాలన విషయంలో తనదైన ముద్ర వేస్తున్నారు.. కోవిడ్‌పై డీఎంకే సర్కార్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇప్పటికే పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు విరాళాలు ఇస్తున్నారు. మరోవైపు.. కోవిడ్‌పై పోరాటాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. దీని కోసం తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.. 13 మంది ఎమ్మెల్యేలతో ఒక సలహా మండలిని ఏర్పాటు…