సీఎం అయితే మాకేంటి..? అక్రమాల వల్లే అరెస్ట్.. ఈడీ కౌంటర్ అఫిడవిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi liquor case: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ముడిపడిన మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్ పెద్ద ఎత్తున సాక్ష్యాధారాల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. కుంభకోణం జరిగిన టైంలో ఏకంగా 173 సెల్ ఫోన్స్ ధ్వంసం చేయడంతో పాటు ఆధారాలను ధ్వంసం చేశారని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. కేజ్రీవాల్ కు ఏకంగా తొమ్మిది సార్లు నోటీసులు పంపినప్పటికీ ఆయన విచారణకు రాలేదని ఈడీ పేర్కొనింది. సమన్లను పదేపదే దాట వేశారు.. ఇదే సమయంలో అరెస్ట్ నుంచి రక్షణను ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు కూడా తేల్చిచెప్పడంతో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశామని ఈడీ తెలిపింది.
Read Also: Ileana D’Cruz :అలసిపోయాను.. ఇక నా వల్ల కాదు
Also Read
- Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
కాగా, ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి కేజ్రీవాల్‌కు రిలీఫ్ దొరకలేదు అందుకే అతడి ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత అరెస్ట్ చేశామని కౌంటర్ అఫిడవిట్‌లో ఈడీ వివరించింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో అరెస్ట్ చేశారనే ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ… నిందితుడి స్థాయితో తమకు సంబంధం లేదు, సాక్ష్యాలను ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. నేరారోపణలు ఉన్న రాజకీయ నాయకులకు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తే ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బ తీసినట్టేనని ఈడీ కామెంట్స్ చేసింది. ఆధారాలను బట్టి ఒక వ్యక్తిని అరెస్టు చేయడం స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల భావనను ఉల్లంఘించినట్టు కాదని చెప్పింది. కేజ్రీవాల్ వాదనతో ఏకీభవిస్తే నేరస్థులైన రాజకీయ నాయకులకు అరెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుందని అనే భావన వస్తుందని ఈడీ చెప్పుకొచ్చింది.
Read Also: APL lockout: ఏపీ పేపర్ మిల్లు ఆకస్మిక లాకౌట్.. ఉన్నట్టుండి ఎందుకు..?
అయితే, ఈడీ కౌంటర్ అఫిడవిట్‌లోని అంశాలను ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించింది. దర్యాప్తు సంస్థ అన్నీ అబద్ధాలే చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని.. బీజేపీ రాజకీయ విభాగంగా ఈడీ మారిపోయి.. అబద్ధాలు చెప్పే యంత్రంగా ఈడీ తయారయ్యిందని ఆప్ విమర్శలు చేసింది.
తాజావార్తలు
-
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!