CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుని మైనర్ కూతురిని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి లైగింకంగా వేధించాడు. ఉన్నతాధికారి లైగింకవేధింపుల మూలంగా మైనర్ బాలిక గర్భం దాల్చింది. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. వారు కేసు నమోదు చేశారు. ఈ విషయం కాస్త ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తెలియడంతో వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని ఆదేశించిన కేజ్రీవాల్ సాయంత్రం 5 గంటల లోపు అతన్ని ఉద్యోగంలో నుంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ అధికారి తన స్నేహితుడి మైనర్ కుమార్తెపై అనేకసార్లు అత్యాచారం చేసి, గర్భం దాల్చడానికి కారణమయ్యాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
Read also: Vande Bharat: మెరుగైన ఫీచర్లతో వందేభారత్ బోగీల అప్ గ్రేడ్.. పూర్తయిన కాషాయ కలరింగ్..!
బాధితురాలు ప్రస్తుతం 12వ తరగతి విద్యార్థిని. కాగా 2020 లో బాధితురాలు తన తండ్రిని కోల్పోయింది. ఈ క్రమంలో తన తండ్రి స్నేహితుడైన డబ్ల్యూసీడీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ అయిన అధికారి బాలికను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. అప్పటి నుంచి బాధిత కుటుంబం అధికారి కుటుంబంతోనే కలిసి ఉంటోంది. అప్పటి నుంచి వారి కుటుంబ బాగోగులు, వారి అవసరాలను తీర్చేవాడు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం ఆ అధికారిని పూర్తిగా నమ్మింది. ఈ క్రమంలో ఆ అధికారి మైనర్‌పై 2020 నుంచి 2021 మధ్య పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆ చిన్నారి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అధికారి తన భార్యకు చెప్పాడు. బాలికకు తెలియకుండా అధికారి భార్య బాలికకు గర్బ నిరోధక మాత్రలు వేసి అబార్షన్ చేయించింది. తరువాత బాధితురాలు 2021 జనవరిలో తన తల్లి వద్దకు తిరిగి వచ్చింది. అయితే బాలిక ఈ ఏడాది ఆగస్టులో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని కౌన్సిలర్‌తో వివరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారిపై బాలలపై అత్యాచారం కేసు నమోదైంది. బాలల వేధింపుల కేసుల దర్యాప్తు కోసం భారతీయ శిక్షాస్మృతి (IPC) మరియు లైంగిక నేరాల నుండి పిల్లలకు కఠినమైన రక్షణ (Pocso) చట్టంలోని అనేక సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు సీనియర్ అధికారిపై FIR నమోదు చేశారు. చిన్నారిపై అఘాయిత్యానికి సహకరించినందుకు సదరు అధికారి భార్యపై కూడా అభియోగాలు మోపారు.
Read also: Anasuya: అనసూయ పొలిటికల్ ఎంట్రీ ?.. జాతకం చెప్పిన వేణుస్వామి..
ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఢిల్లీలో మహిళా శిశు సంక్షేమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు అతడిని ఇంకా అరెస్టు చేయలేదు. అతడికి నోటీసులు జారీ చేస్తున్నారు. కూతుళ్లను కాపాడాల్సిన వాడు వేటగాడిగా మారితే అమ్మాయిలు ఎక్కడికి పోతారు! వెంటనే అరెస్టు చేయాలి!’’ అని ఆమె ట్వీట్ చేశారు. ఢిల్లీ రాష్ట్ర మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ “ఇది చాలా భయంకరమైన ఘటన…ఈ ఘటనతో మానవాళి సిగ్గుతో తలదించుకునేలా చేసింది.ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి.. చర్యలు తీసుకోకపోవడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారని .. సాయంత్రం 5 గంటల లోపు నివేదికను అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారని, అధికారిని అరెస్టు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలం కావడం ఈ కేసులో అత్యంత దారుణమని సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు.