CM Kejriwal: ఈడీ సమన్లపై గందరగోళం.. ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Kejriwal: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లపై గందరగోళం మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈడీ సమన్లకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్‌ను ఈడీ ప్రశ్నించేందుకు సమన్లు పంపింది. నవంబర్ 2న ఈడీ ముందు హాజరుకావాలని తెలిపింది. అయితే సీఎం కేజ్రీవాల్ మాత్రం హాజరుకాలేదు. అంతేకాకుండా.. ఈడీకి ఓ లేఖ రాశారు. ఈడీ సమన్లను ఉపసంహరించుకోవాలని తెలిపారు. ఇది రాజకీయ ప్రేరేపితమని అన్నారు. అదే రోజు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రోడ్ షోలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లారు.
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈడీ తనను అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు. తనలా ఆలోచించే వారిని కూడా ఈడీ అరెస్ట్ చేస్తుందా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. నిన్న హర్యానాలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “మీరు నన్ను అరెస్టు చేయండి, మోడీ నన్ను కాల్చివేస్తారు, కేజ్రీవాల్ చనిపోతారు, కానీ నిద్రలో మీరు నా గొంతు వింటారు.. నా వాయిస్ మీ చెవులలో ప్రతిధ్వనిస్తుంది. మీరు ప్రశాంతంగా నిద్రపోరని చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!