Festival of Ponds: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా చెరువుల పండుగను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువుల పండుగ నిర్వహించనున్నారు.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో కొత్త పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం, కేజ్రీవాల్ కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన మనీష్ సిసోడియాను గురించి తలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. గత ఫిబ్రవరి నెల నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.