Harish Rao: పుట్టుక నుండి చావు దాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది సీఎం కేసీఆర్ అని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. KPHB డివిజన్ 5 వ ఫేస్ లోధ టవర్స్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం అయ్యారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ను సీఎం కేసీఆర్ తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.
గద్దర్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారు అనే చర్చ పార్టీలో జరగలేదని.. ఏదైనా అధిష్ఠానమే ఫైనల్ చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీఆర్‌ఎస్ ఖేల్ ఖతం అయిందని ఆయన అన్నారు. బీజేపీ మహా జన సంపర్క్ అభియాన్ సన్నాహక సభలో ఆయన మాట్లాడారు.
Ponguleti: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతుంది. ఖమ్మంలో ఎస్.ఆర్ కాన్ వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
Distribution of Sheep: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొల్ల, కురుమలకు 2వ దశ సబ్సిడీ గొర్రెల పంపిణీ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మూడు పథకాలను ప్రారంభించనున్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ, కుల వృత్తులు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, గృహలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.