కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడం కేసీఆర్ నీవల్ల కాదు కదా! మీ తాత వల్ల కూడా కాదు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నీలాంటి కేసీఆర్ లను వందల మందిని కాంగ్రెస్ చూసింది.. నిన్నే మూడు చెరువుల నీళ్లు తాపించి మూడు నెలల్లో బంగాళాఖాతంలో ముంచుతాం.. ఇక కాస్కో ఖబర్దార్ అంటూ సవాల్ విసిరారు.
హైదరాబాద్ లోని కోకాపేటలో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా భవనానికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ జిల్లాకేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ ఏర్పాట్లపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు.
సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పడిన సురారం పోలీస్ స్టేషన్ ను ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద, మేడ్చల్ డీసీపీ సందీప్ రావు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ చేస్తున్న కృషికి మరో జాతీయ గుర్తింపు దక్కింది. అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ తన ‘ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్ 2023: ఇన్ ఫిగర్స్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.