Minister KTR Speech In Mulugu Saguneeti Meeting: నాడు దాశరథి జైలు గోడల మీద ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అని రాస్తే.. నేడు సీఎం కేసీఆర్ ‘తెలంగాణ కోటిరత్నాల వీణనే కాదు, కోటిన్నర ఎకరాల మాగాణి’ అని నిరూపించారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తన మునుగు జిల్లా పర్యటనలో భాగంగా సాగునీటి దినోత్సవ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. మండు వేసవిలో ఏనాడైనా నీళ్ళు కనిపించాయా? అని ప్రశ్నించారు. తాగునీరు ఇవ్వక చావగొట్టి.. సాగునీరు ఇవ్వకుండా సతాయించింది కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు. సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనరు, పెట్టుబడి ఇవ్వరు కానీ.. ఇక్కడ ప్రజల్ని అంగం చేసేలా డైలాగ్‌లు చెబుతున్నారని విరుచుకుపడ్డారు.
Jeevandan Swarnalatha: దేశవ్యాప్తంగా అవయవదానంలో తెలంగాణ రాష్ట్రమే టాప్
ఎన్నో ఏళ్ళుగా గిరిజనులు ఎదురుచూసిన 3100 తండాలను సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా మార్చారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ములుగులో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. ఇక్కడి ప్రజల కోసం కేసీఆర్ నలుగురు మంత్రులను పంపించి, పలు అభివృద్ధి పనులు ప్రారంభింపజేశారని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ములుగును మున్సిపాలిటీని మార్చామన్నారు. కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు రూ.133 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలియజేశారు. దళితులకు, గిరిజనులకు, యాదవులకు, మహిళా సంఘాలకు రూ.110 కోట్ల ఆస్తులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 17 వేల ఎకరాలకు, పోడు భూములకు పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. తెలంగాణ వస్తే ఏం వచ్చిందని ప్రశ్నించే వారికి.. జాతీయ స్థాయిలో ములుగు రెండో స్థానం సాధించిన ఘనత చాలదా? అని అడిగారు. వడ్లు కోనే తెలివిలేనోళ్ళు.. చేతగాని దద్దమ్మలు.. దిక్కుమాలిన కాంగ్రెస్ నాయకులు డైలాగ్‌లు చెబితే మోసపోతామా? అని ప్రశ్నించారు.
Mallu Ravi: ధరణిపై చర్చకు సిద్ధమా.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మల్లురవి సవాల్
మోసపోయి గోస పడదామా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా హామీ ఇవ్వని పనులెన్నో చేసిన కేసిఆర్‌కు రుణపడి ఉందామా? అనేది ఆలోచించుకోవాలని కేటీఆర్ ప్రజల్ని సూచించారు. బహురూల వేశాలు వేసుకుని వచ్చే వారిని నమ్మి మోసపోకండని అన్నారు. ములుగు జిల్లాలో లక్షా 65 వేల మంది హెల్త్ ప్రోఫైల్ సిద్ధం చేశామన్న ఆయన.. వచ్చే ఏడాది నుంచి పనిచేసే మెడికల్ కాలేజీలో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. 60 ఏళ్ళల్లో చేయని పనులను.. 8 ఏళ్ళలో కేసిఆర్ చేసి చూపించారన్నారు. వారి రుణం తీర్చుకునేలా వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ కోరారు.