MLC Kavitha: ముఖ్యమంత్రిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జరిగిన నీటి పారుదల దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
Minister KTR: నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. 150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కేటీఆర్ చేయనున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది.
Bhatti vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేడు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామ శివారులోని మర్లపాడ్ తండాకు చేరుకున్న సందర్భంగా రోడ్డు పక్కనే గ్రామస్తులు మూడవత్ రెడ్యానాయక్, హనుమంతు నాయక్, బొజ్యానాయక్, జగన్ నాయక్, సత్య నాయక్, రాంలీ నాయక్, రమేష్ .. భట్టి విక్రమార్కకు స్వాగతం పలికారు.
KCR: నేడు నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో రూ.53 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయాలతో పాటు దేశిఇటిక్యాల శివారులో నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు.