రీంనగర్ జిల్లా గంగధర మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోయిన సంవత్సరము అసెంబ్లీ సాక్షిగా 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన కేటీఆర్ ఇప్పటివరకు 8000 ఉద్యోగాలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. చొప్పదండి నియోజకవర్గంలో ఎటు చూసినా కాలువలే కానీ పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేకపోతున్నారని.. breaking news, latest news, telugu news, cm kcr, jeevan reddy, congress, cm kcr
లష్కర్ బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని పలువురు రాజకీయ నేతలు దర్శించుకున్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ లో నిర్వహించిన పూజలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. అయితే.. ఎమ్మెల్సీ కవితకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, పండితులు స్వాగతం పలికారు.
CM KCR: సీఎం కేసీఆర్ మహరాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీని ఆ రాష్ట్రంలో బలోపేతం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల్లోని జిల్లాల్లో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరిగాయి.
గత కొంతకాలంగా మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ( శనివారం) మహారాష్ట్రకు చెందిన బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ స్వయంగా కండువా కప్పి వారికి సాదర స్వాగతం పలికారు.
ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను కూల దొస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో 1, 2, 3 స్థానాల్లో ముందుంది అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ప్రధాని స్థాయి దిగజారి మా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గుత్తా మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంపైన, సీఎం కేసీఆర్ పైన ప్రధాన మంత్రి మోడీ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ పార్టీలో అనేక మంది కుటుంబ సభ్యులు ఎంపీలుగా ఉన్నారు.. అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ అంటున్నారు.. ఎక్కడ అవినీతి ఉందొ తెల్వదా?.. అని వినోద్ కుమార్ అడిగారు.
వరంగల్‌లో సీఎం కేసీఆర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన విమర్శలకు మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. ప్రధాని హోదాలో మోడీ అన్ని అబద్దాలే మాట్లాడారు అని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓ పెద్ద దద్దమ్మ.. రాహుల్, మోడీ ఇద్దరూ దొంగలే.. దేశం నాశనానికి వీరే కారకులు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.