ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను కూల దొస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో 1, 2, 3 స్థానాల్లో ముందుంది అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ప్రధాని స్థాయి దిగజారి మా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గుత్తా మండిపడ్డారు. మోడీ తొమ్మిది సంవత్సరాల కాలంలో 12 లక్షల కోట్లకు పైగా ఆయనకు కావాల్సిన కొంత మంది పెద్దలకు సంబంధించిన రుణమాఫీ చేయించాడు అని ఆయన అన్నారు.
Read Also: Dil Raju: దిల్ రాజుకి ‘సలార్’ రెడ్ సిగ్నల్?
ఇండియన్ రూపాయి విలువ ఇంత ఘోరంగా ఎప్పుడు పతనం కాలేదు.. అదానీ చేసే కుంభకోణాలకు ప్రధాని హస్తం ఉందని దేశంలో అందరూ అంటున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎన్నడు లేని విధంగా నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి.. దేశంలో ఏ రాష్ట్రంలోని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి.. అపవాదులు అసత్య ప్రచారాలు చేసేందుకే ఢిల్లీ నుంచి ఇక్కడికి మోడీ వచ్చాడు అని గుత్తా కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పూనుకున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మతాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగానైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ కుట్రలను తెలంగాణలో పని చేయవని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
Read Also: Viral Video: స్పెయిన్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోతున్న కార్లు, వాటిపై జనాలు.. వీడియో వైరల్