ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్‌లో పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు.
రాష్ట్రంలో పనీ చేస్తున్న 27 వేల మంది ఆశలకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఈనెల నుంచి ఆశాలకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు.
మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల సంగతి అతీగతీ లేదని, పక్క రాష్ట్రంలో 15 లక్షల ఇళ్లు కట్టారన్నారు. పార్టీ ఆఫీస్ లకు స్థలం ఉంటుంది తప్ప పేద ప్రజలకు ఇళ్లకు ఇవ్వడానికి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతినీ ప్రశ్నించకుండ ఉండడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ మానవ హక్కులు కమిషన్ కమిషనర్ లేకుండా చేశారంటూ ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకు వచ్చి మా చారిటీ భూములను ఆగం చేశారు.. నన్ను తిట్టిన జస్టిస్ ఉజ్జల్ భూయన్ ట్రాన్స్ ఫర్ అయ్యాడు అంటూ ఆయన వ్యాఖ్యనించాడు.
గాంధీ భవన్ లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భూమి డిక్లరేషన్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ వెనక పెద్ద గూడు పుటాని జరిగింది.. రోజుకోకటి బయట పెడతామని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ టేరసీసీ కంపనీ వెనుక.. ఫిలిప్పీన్.. దాని వెనక అమెరికా కంపెనీలు వచ్చాయన్నారు. విదేశీయులు ధరణి పోర్టల్ నడుపుతున్నారు అని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు.
Minister KTR: 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా లోని 1650 మందికి పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ప్రాజెక్ట్ అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే, తాజాగా రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.