Jaggareddy: ఆలయ అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు అవసరం..సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaggareddy: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల పండుగ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు దర్శించుకున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆలయ ఏడుతరాలవారితో చర్చించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లష్కర్ బోనాల సమయంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ. 1000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ఆ నిధుల కోసం త్వరలో సీఎం కేసీఆర్ కు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని, పాడి రైతులు బాగుండాలని రాష్ట్ర ప్రజలంతా అమ్మను కోరుకున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు.
Read also: TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ట్విస్ట్.. ఏఈ 16వ ర్యాంకర్ నాగరాజు అరెస్ట్
Also Read
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతా వైభవంగా జరిగింది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టం రంగం కార్యక్రమం ఇవాళ ఉదయం 10 గంటలకు జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.‘ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరించానని అన్నారు. గత ఏడాది చేసిన వాగ్దానాన్ని మరిచిపోయారని అన్నారు. మీ అందరికి అవసరమైన బలాన్ని ఇచ్చానని అన్నారు. మీ వెంటే నేను ఉంటాను అన్నారు. వానలు పడతాయి.. మీరు భయపడకండి. ఆలస్యమైనా వర్షాలు కురుస్తాయని.. అగ్ని ప్రామాదాలు జరుగుతాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఐదు వారాల పాటు నైవేద్యాలు సమర్పించాలని అన్నారు. స్వర్ణలత భవిష్యవాణి మాట్లాడుతూ.. భక్తులు ఏ పూజలు చేసినా ఆనందంగా స్వీకరిస్తానని తెలిపారు. ఏది బయట పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసని అన్నారు. సంతోషంగా ఎటువంటి లోపం లేకుండా ఆనందంగా పూజలు అందుకున్నానని తెలిపారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను, మీతోనే నేను ఉంటానని అన్నారు. నా వద్దకి వచ్చిన వారిని చల్లగా చుసుకునే బాధ్యత నాదన్నారు. 5 వారాలు నాకు సాక పోయండి నాయన అన్నారు. ఏడూ వచ్చేసరికి నాకు తప్పని సరిగా జరిపించండని తెలిపారు. దీంతో రంగం కార్యక్రమం భవిష్యవాణి పూరైంది. ప్రవచనం వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు.
Talasani: ఆటంకం లేకుండా బోనాలు.. సంతోషించిన అమ్మవారు
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!