తెలంగాణ రాష్ట్రంపైన, సీఎం కేసీఆర్ పైన ప్రధాన మంత్రి మోడీ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ పార్టీలో అనేక మంది కుటుంబ సభ్యులు ఎంపీలుగా ఉన్నారు.. అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ అంటున్నారు.. ఎక్కడ అవినీతి ఉందొ తెల్వదా?.. అని వినోద్ కుమార్ అడిగారు. నవోదయ విద్యాలయాలు కావాలని మేము అడిగితే ఒక్కటి కూడా ఇవ్వలేదు.. అప్పుడు ఆ శాఖ మంత్రి ఇప్పటి ఇంచార్జ్ జవదేకర్ ఉండే.. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు తెలంగాణకు నవోదయ పాఠశాలలు అని ప్రశ్నించారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
యూనివర్సిటీ లలో ఉద్యోగ నియామకాలు జరగాలి అనే చట్టం చేస్తే ఇప్పటికి ఆమోదం తెలుపలేదు అని వినోద్ కుమార్ అన్నారు. మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు.. ఎన్నికలు వస్తున్నాయి కదా ఏమైనా ప్రకటనలు చేస్తాడేమో అని అనుకున్నము కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో యావత్ తెలంగాణ ప్రజలు నిరాశ చెందారు అని ఆయన తెలిపారు. ఎక్కడ ఎన్నికలు జరిగిన ఎదో ప్రకటన చేసే మోడీ ఇక్కడ మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయలేదు అని వెల్లడించారు.
Read Also: Viral Video: భార్యాభర్తల బంధం అంటే ఇదేనేమో.. వీడియో వైరల్
తెలంగాణ అభివృద్ధికి ప్రధాని ప్రకటన చేయలేదు అంటేనే అర్థం అవుతుంది.. ఎందుకంటే ఇక్కడ గెలిచేది లేదు కాబట్టే అలాంటి ప్రకటన చేయాల్సిన అవసరం మోడీకి లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ అన్నారు. తెలంగాణలోని ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ప్రకటన చేస్తాడేమోనని అనుకున్నాం.. అనేక రహదారులు జాతీయ రహదరులుగా ప్రకటన చేస్తాడని అనుకున్నాం.. కానీ పాత వాటికే శంకుస్థాపన చేశారు తప్ప కొత్తవి ప్రకటన చేయలేదన్నాడు.
Read Also: Minister RK Roja: ఓడించడానికి ఇది మీ అడ్డా కాదురా బిడ్డా.. ఏపీ జగనన్న అడ్డా..
విభజన హామీలు ఒక్కటి కూడా ప్రధాని మోడీ మాట్లాడలేదు అని వినోద్ కుమార్ అన్నారు. ఆబ్కా సర్కార్ బీజేపీ సర్కార్ అన్నాడు.. ఇది కూడా కిసాన్ సర్కార్ అనే మన నినాదంను నుంచే మోడీ కాఫీ కొట్టాడు అని తెలిపాడు. వరంగల్ సభలో తెలంగాణ ప్రజలను బీజేపీ ఇవాళ మళ్ళీ వంచించింది. తెలంగాణ ప్రజలను మోడీ మరోసారి మోసం చేశాడు.. అయితే, మోడీ ఎక్కడకు వెళ్లిన అవినీతి అనే మాటలు తప్ప ఎలాంటి మాటలు రావు.. ప్రతిపక్ష పార్టీలు ఉన్న ప్రతి దగ్గర కూడా ఇలాంటి మాటలే మోడీ మాట్లాడుతారు అని వినోద్ కుమార్ అన్నారు.