MLC Jeevan Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ 4000 రూపాయలు ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా గంగధర మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోయిన సంవత్సరము అసెంబ్లీ సాక్షిగా 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన కేటీఆర్ ఇప్పటివరకు 8000 ఉద్యోగాలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. చొప్పదండి నియోజకవర్గంలో ఎటు చూసినా కాలువలే కానీ పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేకపోతున్నారని, కొడిమ్యాల పోతారం చెరువును పూర్తి చేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు 35000 మాత్రమే రుణమాఫీ అయినాయని ఆయన మండిపడ్డారు. దళితులకు దళిత బందు ఇస్తానని చెప్పి అరిగిపోయిన రికార్డు మళ్లీ వేసినట్లు ఇప్పటికి 17 వేల కోట్లు కేటాయించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read : Harish Rao: తెలంగాణపై ఫేక్ ప్రేమ ప్రతిపక్షాలది.. ఫెవికల్ ప్రేమ కేసీఆర్ ది
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
సీఎం కేసీఆర్ దళితులతో పాటు అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమేనని వరంగల్ సభలో స్వయంగా ప్రధానమంత్రి మోడీ చెప్పారని గుర్తు చేశారు జీవన్ రెడ్డి. రాష్ర్ట ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నా సీఎం కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కేంద్రాన్ని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. చర్యలు తీసుకోకపోవడం అంటే ప్రత్యక్షంగా ప్రభుత్వ తీరును ప్రోత్సహిస్తున్నట్లే అని చెప్పారు. దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మైత్రి బంధానికి ఇంతకంటే ఏం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో యువత ప్రధాన పాత్ర పోషించబోతుందని జీవన్ రెడ్డి చెప్పారు.
Also Read : Blood & Chocolate: లెజండరీ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ ఆడియో రిలీజ్
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!