దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ”ముఖ్యమంత్రిగారు దళిత బంధు పథకం నిజాయితీతో ప్రకటించినట్లయితే ఎంతైనా అభినందనీయం… అయితే, గతంలో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు లాంటి అనేక హామీలు తుంగలోకి తొక్కడం… దళిత ఉపముఖ్యమంత్రులను అవమానకరంగా ఊడపీకడం వంటి దళిత వ్యతిరేక చర్యల దృష్ట్యా కేసీఆర్ గారిని…
దళిత బంధు పథకం ద్వారా లబ్ది పొందే అర్హులకు గుర్తింపు కార్డును అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతీ లబ్ధిదారునికి ప్రత్యేకమైన బార్ కోడ్ తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్ ను ఐడీ కార్డులో చేర్చి పథకం అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తామని వెల్లడించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. లబ్ధి దారుడు తను ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదగాలి…
సీఎం కేసీఆర్ పై మరోసారి ఈటెల రాజేందర్ సంచలన కామెంట్ చేశారు. కెసిఆర్ కు నీతి, జాతి లేదు మానవత్వం లేదని.. అసలు మనిషే కాదని నిప్పులు చెరిగారు. భూ కబ్జా కేసు ఎందుకు పక్కకు పోయింది…తప్పు చేస్తే తనను జైలుకు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. ఒక్క సారి తింటేనే మరచిపోమని… అలాంటిది ఇన్నాళ్లు కలిసి ఉన్న నన్ను ఇలా చేస్తావా? అంటూ నిలదీశారు. Read Also : ధోనితో రణ్వీర్ సింగ్ ఫుట్ బాల్ మ్యాచ్……
సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎం.పీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలని… పంటల బీమా అమలు కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని… కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి…
పదవీ విరమణ వయస్సు 61 యేండ్లకు పెంపు పై సింగరేణి భవన్ లో సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో పదవి విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతూ ఈ సందర్భంగా బోర్డు నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్ణయం ప్రకారం… పెంచిన వయస్సు మార్చి 31, 2021 నుండి అమల్లోకి రానుంది. అలాగే మార్చి 31 జూన్ 30వ తేదీ మధ్య కాలంలో రిటైర్మెంట్ తీసుకున్న 39…
”దళిత బంధు పథకం’’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకోవాలని…’దళితబంధు’ కేవలం కార్యక్రమం కాదు ఉద్యమం అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ దళిత సమాజం వ్యాపార వర్గం గా అభివృద్ది చెందాలని.. గ్రామాల్లోని ఇతర వర్గాలు దళితుల వద్దకే అప్పుకోసం వచ్చే దిశగా దళితుల ఆర్థిక సాధికారత సాధించాలని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలులోకి తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం…
ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సిఎం అన్నారు. కాకతీయ రేచర్ల…
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ పీసీసీ ఛీప్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘దళిత బంధు పేరిట దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ పథకాన్ని రచించాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. దళితులకు 3 ఎకరాల…
కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ‘దళిత బంధు పథకం’ రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళిత బంధు కేవలం తెలంగాణలో…
హుజురాబాద్‌లో హత్యా రాజకీయాలు వర్కవుట్ అవుతాయా? ఉపఎన్నికను చావో రేవోగా భావిస్తూ.. తాజాగా చేసిన కామెంట్స్ ఈటలకు కలిసి వస్తాయా? ప్రత్యర్ధి పార్టీలు వేసే ఎత్తుగడలతో ఈటలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? హుజురాబాద్‌లో మారుతున్న వ్యూహాలు ఉపఎన్నికల షెడ్యుల్ విడుదల కంటే ముందే హుజురాబాద్‌లో సందడి మొదలైంది. రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచుకుంటూ పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్ ఉపఎన్నికపైనే ఉంది. అక్కడ రాజకీయ పార్టీల నాయకులు చేసే ప్రకటనలు సర్వత్రా…