దళిత బంధు పథకం ద్వారా లబ్ది పొందే అర్హులకు గుర్తింపు కార్డును అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతీ లబ్ధిదారునికి ప్రత్యేకమైన బార్ కోడ్ తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్ ను ఐడీ కార్డులో చేర్చి పథకం అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తామని వెల్లడించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. లబ్ధి దారుడు తను ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదగాలి తప్ప.. జారి పడనివ్వబోమని హామీ ఇచ్చారు సీఎం కెసిఆర్. అలాగే… దళిత జాతి సముద్దరణలో భాగంగా, దళిత బంధు పథకం అమలుతో పాటు, దళిత వాడలల్లో మిగిలివున్న, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులకు సీఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.