సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నాడు: ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ పీసీసీ ఛీప్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘దళిత బంధు పేరిట దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ పథకాన్ని రచించాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశాడని ఉత్తమ్ విమర్శించారు.
2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఫోన్లు అన్ని ట్యాపింగ్ జరుగుతుందన్నారు. పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ను ఇజ్రాయిల్ దేశం నుండి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రతిపక్ష పార్టీల, ఇతర సంస్థలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. కాదని కేసీఆర్ ని చెప్పమనండి అంటూ ఉత్తమ్ సవాల్ విసిరారు. కేసీఆర్ కు తన సొంత పార్టీ నాయకుల మీద నమ్మకం లేక వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయిస్తున్నాడు. రిటైర్డ్ అధికారులును, ఇంటెలిజెన్స్ ఐజి, టాస్క్ ఫోర్స్ ఐజీలుగా కేసీఆర్ బంధువులను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఉత్తమ్ తెలిపారు.
Also Read
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై విమర్శలు గుప్పించారు ఉత్తమ్. హుజూర్ నగర్ లో ఎప్పుడూ లేని విధంగా అక్రమాలు, అరాచకాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఫస్ట్ అండ్ లాస్ట్ ఎమ్మెల్యే అంటూ ఏకవచనంతో విమర్శలు గుప్పించారు. అతడికి భయపడేది ఏంది అన్నారు. రికార్డు స్థాయిలో అవినీతి చేసి ఆరు నెలల్లో హైదరాబాదు, హుజుర్ నగర్ లో పెద్దపెద్ద భవంతులు రికార్డు స్థాయిలో నిర్మించుకున్నాడని, ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ మంత్రిగా ఉండి తాను సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేకపోయాను అని ఉత్తమ్ అన్నారు. హుజుర్ నగర్ అభివృద్ధిపై డిబేట్ లో మాట్లాడటానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ గుండాలు ఓ మీడియా సంస్థపై దాడికి పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు అని ఉత్తమ్ తెలిపారు.
గుర్రంపోడు విషయంలో ఓ పార్టీ నాయకులపై పెద్దపెద్ద కేసులు పెట్టి జైల్లో పెట్టిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు మీడియాపై దాడి చేసిన టిఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం లేదన్నారు. ఎమ్మెల్యే బామ్మర్దులకు, టిఆర్ఎస్ గుండాలకు చట్టాలు వర్తించవా.. అధికారులు స్పందించకపోతే ప్రజలు తిరగబడతారు. మీడియాపై దాడి చేసిన పార్టీ నాయకుడ్ని విలేకరుల్లే సన్మానం చేయడం విడ్డూరంగా ఉంది. హుజూర్ నగర్ పట్టణంలో మున్సిపల్ భూములు, అంజనీ సిమెంట్, చింత్రియాల, గుర్రంపోడు వద్ద ఆక్రమించిన ప్రభుత్వ అటవీ భూముల వ్యవహారం, చెక్ డాం నిర్మాణంలో అవకతవకలు, నాలుగు వేల ఇండ్లను డంపింగ్ యార్డ్ గా చేసిన వ్యవహారం, కాంట్రాక్టుల్లో కమిషన్ తీసుకుంటున్న వ్యవహారంపై.. వీరికి సహకరిస్తున్న కేసీఆర్ బంధువు సంతోష్ పై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తాం’ అంటూ ఉత్తమ్ తెలిపారు.
తాజావార్తలు
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!