తెలంగాణ రాష్ట్రంలో దళితుడే ముఖ్యమంత్రి అని నమ్మించి మోసం చేసిన సీఎం కేసీఆరే దళితుల ప్రధాన శతృవు అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఏడేండ్లపాలనలో దళితులకు అన్యాయమే జరిగింది, ఏనాడూ దళితబంధు కాలేదు.. కేసీఆర్ రాబందులా కనిపిస్తున్నాడు అంటూ మందకృష్ణ విమర్శలు చేశారు. కేసీఆర్ అవసరమైన సమయంలో ఎదో నిర్ణయం తీసుకుంటాడు ఆతర్వాత పక్కకు పడేస్తాడు. హుజూరాబాద్ లో మెజార్టీ ఓట్లు దళితుల ఉన్నాయి కాబట్టే పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు తీసుకొచ్చాడు, 60 వేల ఓట్లపై కన్నేసి పథక రచన చేశాడు. నమ్మించడానికి చేసే పథకం కాబట్టి కన్ఫ్యూజ్ చేసే లాగానే కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటూ మందకృష్ణ ఆరోపించాడు.
ఏడేండ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీల స్థితిగతులు సైతం నేడు లేవు. దళితులను అన్నిరంగాల్లో వెనక్కినెట్టి కృష్ణుడు కేసీఆర్.. దళిత ముఖ్యమంత్రి హామీ మరచిపోవటానికే దళితులకు మూడెకరాల భూమి పథకం తెచ్చాడు. ఒక శాతం కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ చేయలేదు, ఒక్క శాతం భూమిని సైతం దళితులకు పంపిణీ చేయలేదు. నిర్మల్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అసైన్డ్ భూముల్లో దళితుల భూములు లాక్కొని కట్టారు. రాష్ట్రంలో ఎక్కడైనా రెండు వందల ఎకరాలు దళితులకు పంచలేదు కాని రెండు వందల ఎకరాల భూమిని లాక్కున్నారు అంటూ మందకృష్ణ విమర్శలు చేశారు.