కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నాగార్జున సాగర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హాలియాలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన పలు విమర్శలు చేశారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, జానారెడ్డి మాటతప్పి నాగార్జున సాగర్ ఎన్నికల్లో పోటీ చేశారని అన్నారు. దేశానికే ఆదర్శంగా 24 గంటల కరెంట్ ఇచ్చినట్టు కేసీఆర్ పేర్కొన్నారు. దళితబంధుపై ఎన్నో విమర్శలు చేస్తున్నారని, 12 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అందిస్తున్నామని అన్నారు. ఒక్కో కుటుంబానికి తప్పకుండా రూ.10 లక్షలు ఆర్ధికసాయం చేస్తామని అన్నారు. ప్రతి నియోజక వర్గంలో వంద కుటుంబాలకు ఈ ఏడాది దళితబంధును అమలు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. దళితబంధుతో పార్టీలకు గుండెదడ మొదలైందని, రాజకీయ పార్టీలకు బీపీ మొదలైందని అన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా విషయంలో జానారెడ్డి గతంలో ఎద్దేవా చేశారని సీఎం కేసీఆర్ విమర్శించారు.
Read: ఎట్టకేలకు స్పందించిన శిల్పాశెట్టి… భర్త కేసుపై సుదీర్ఘ వివరణ
Also Read
- Tags
- cm kcr
- Halia
- kcr
- nagarjuna sagar
- TRS
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!