టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో పలు జిల్లాల అధ్యక్షులు అధినేత, సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ లు సీఎం కేసీఆర్ ను…
రాష్ట్రంలో అటవీ భూములపై హక్కుపత్రాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కి ఆదివాసీల ప్రతినిధులు కోరారు. ప్రగతి భవన్ లో మంత్రి కే. తారక రామారావు ని కలిసిన ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించారు.తమ తెగలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ ను కోరారు. షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ చర్యల పైన తమ అభిప్రాయాలను తెలియజేశారు. తక్కువ సంఖ్యలో… ఎక్కువ ప్రాంతాల్లో…
డ్రగ్స్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఇకపై రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకుండా చేయాలని ఆదేశించారు.. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.. ఇక, డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు కేసీఆర్.. దీని కోసం ఎల్లుండి ప్రగతిభవన్‌లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు.. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ మంత్రి, సీఎస్, డీజీపీ,…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాకుండా తప్పుచేశారని… ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆరోపించారు. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో కనీసం సీనియర్ మంత్రి కూడా లేకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం అని ఈటల అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వాదులు బాధపడే సంఘటన అని అభివర్ణించారు. Read Also: 33…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఈరోజు జాబితా విడుదల చేశారు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అంతేకాకుండా ఈ జాబితాలో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జెడ్పీ ఛైర్మన్‌లు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. జిల్లాల వారీగా టీఆర్ఎస్ అధ్యక్షుల జాబితా: ఆదిలాబాద్: జోగురామన్న, ఆసిఫాబాద్: కోనప్ప, మంచిర్యాల: బాల్కసుమన్, నిర్మల్: విఠల్ రెడ్డి, నిజామాబాద్: జీవన్ రెడ్డి, కామారెడ్డి: ముజీబుద్దీన్, కరీంనగర్: రామకృష్ణారావు,…
రెండు మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు నియోజకవర్గ పరిధిలోని అనేక రోడ్లు ధ్వంసమయ్యాయన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. రవాణా వ్యవస్థ ఇబ్బందికి గురవుతుందని తరుణంలో రవాణా వ్యవస్థ కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మండలానికి ఒక ప్రతిపాదన పంపాలని సూచనల మేరకు దుబ్బాక శాసన సభ పరిధిలోని ఉన్నటువంటి ఏడు మండలాలను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 17,2021 రోజున ప్రతిపాదనలు పంపడం జరిగింది. నియోజకవర్గ…
మెతుకుసీమగా పేరున్న మెదక్ తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో అనూహ్య అభివృద్ధి సాధించిందని అన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మెదక్ జిల్లా అభివృద్ధివైపు అడుగులు వేస్తోందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి చెందని మెదక్ నియోజకవర్గం, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు అన్నారు. మెదక్ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి…
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ అంశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పదేపదే ఆరోపిస్తున్నారని, అందుకే తాను ఈ లేఖ రాయాల్సి వస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కారు…
నిజాయితీకి, పరిపాలనా దక్షతకు దామోదరం సంజీవయ్య నిదర్శనం అన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ లక్డీ కాపూల్ లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ హనుమంతరావు సంజీవయ్యను గుర్తుచేశారు. ఈనాడు ఎంతోమంది డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చేవారు డబ్బులు సంపాదించడానికి రావద్దు ..సేవ చెయ్యడానికి రావాలన్నారు. నీతి నిజాయితీకి కలిగిన వ్యక్తి దామోదరం సంజీవయ్య. రెండు ప్రభుత్వాలు శత…