తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. రేపో.. మాపో మరో 40వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. కొత్త జోనల్ విధానంతో యువతకు కావాల్సిన హక్కులు సాధించామని ఆయన తెలిపారు. మల్టీ జోనల్ విధానంతో కేవలం 5శాతం మాత్రమే నాన్ లోకల్ వారు మాత్రమే వస్తారని కేసీఆర్…
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర బడ్జెట్ దారుణంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని… గంగానదిలో శవాలు తేలేలా చేసిందని ఆరోపించారు. గంగానదిలో ఈస్థాయిలో శవాలు తేలడం తానెప్పుడూ చూడలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీ పాలన ఎలా ఉందంటే.. దేశాన్ని అమ్మడం, మతపిచ్చి పెంచి ఓట్లు సంపాదించుకోవడమని కేసీఆర్ విమర్శించారు. Read…
కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ బడ్జెట్ పనికిమాలిన, పసలేని బడ్జెట్ అని ఆయన విమర్శలు చేశారు. అన్ని వర్గాలను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశకు గురిచేసిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై ఈ బడ్జెట్ నీళ్లు చల్లిందని… వేతన జీవుల కోసం ఇంకమ్‌ట్యాక్స్ శ్లాబులలో మార్పులు చేయకపోవడం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు. Read Also: ప్రధాని మోదీ మరో రికార్డు.. ఈ…
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. అయితే తెలంగాణ లో కోవిడ్ ఆంక్షలు జనవరి 31 నాటికి ముగిశాయి. కానీ కోవిడ్ ఆంక్షల గడువు పెంచలేదు ప్రభుత్వం. మళ్ళీ ఆంక్షలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు సర్కార్. బహిరంగ సభలు, ర్యాలీల పై నిషేధిస్తూ రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ జనవరి ఒకటి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో, మాల్స్, షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో మాస్క్ ను తప్పని…
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ అర్థరాత్రి ఒకటిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. ఫోటోగ్రఫీ ద్వారా కల్చరల్ అంబాసిడర్ అఫ్ తెలంగాణగా ఎదిగిన భరత్ భూషణ్ వరంగల్ జిల్లాకు చెందినవారు. వరంగల్ లో గుడిమల్ల అనుసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించిన భరత్ భూషణ్ (66)ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చిన్ననాటినుంచే అటువైపు మళ్లారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్…
తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూనే వున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ వచ్చినా నిరుద్యోగుల కష్టాలు తీరలేదన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యల నివారణలో సీఎం వైఫల్యం చెందారన్నారు. ఉద్యమనాయకుడు కేసీఆర్ కు, సీఎం కేసీఆర్ కు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను సీఎం…
తెలంగాణలో అమలవుతున్న రైతు అనుకూల విధానాల పట్ల ఆకర్షితులై దక్షిణ భారత రైతు సంఘాల నాయకులు తమ తమ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా ఒత్తిడి తేవాలని తీర్మానించారు. అలాంటి తొలి ప్రయత్నంగా శనివారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి రైతు సంఘాల నేతలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా వినతిపత్రం సమర్పించారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేయడంతోపాటు వ్యవసాయ…
సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారిని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. కొమురవెళ్లి మల్లన్న మా ఇంటి కులదైవం ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. ఆలయం వద్ద భక్తులకు మెరుగైన వసతులు…
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్ రావు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అన్ని వార్డులను కలియ తిరిగారు. ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 50 పడకలతో ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటుచేస్తామన్నారు.కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయాన్నారు. ప్రస్తుతం 52 శాతం డెలివరీలు జరుగుతున్నాయని దీన్ని 75 శాతంకు పెంచాలన్నారు. జహీరాబాద్ లోనూ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీలు…
మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అని ఆయన వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల…