నిజాయితీకి, పరిపాలనా దక్షతకు దామోదరం సంజీవయ్య నిదర్శనం అన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ లక్డీ కాపూల్ లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ హనుమంతరావు సంజీవయ్యను గుర్తుచేశారు. ఈనాడు ఎంతోమంది డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చేవారు డబ్బులు సంపాదించడానికి రావద్దు ..సేవ చెయ్యడానికి రావాలన్నారు.
నీతి నిజాయితీకి కలిగిన వ్యక్తి దామోదరం సంజీవయ్య. రెండు ప్రభుత్వాలు శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఆనాటి రాజకీయ నాయకులని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. దామోదరం సంజీవయ్యకి సొంత ఇల్లు లేదు. కేసీఆర్ దళితుడ్ని సీఎం చేయలేదు కాబట్టి దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు చెయ్యాలన్నారు వీహెచ్.
దామోదరం సంజీవయ్య అనేక పదవులు చేసి ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. దామోదరం సంజీవయ్య లాంటి గొప్ప నాయకులు కాంగ్రెస్ లో వున్నారు. కాంగ్రెస్ పార్టీ జీవనది లాంటిది. రెండు ప్రభుత్వాలు దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేము విజయవాడలో దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు చేస్తామన్నారు.