కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతూనే వుంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పండి. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా? దేశం అంటే మట్టి మాత్రమే కాదు. ఎల్ఐసీ అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటన్నారు ఎమ్మెల్సీ కవిత. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?…
సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో మార్పులు రావాలని వ్యాఖ్యానించారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై నిన్న బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. అంతేకాకుండా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్…
రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు (గురువారం) తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టబోతున్నాయి. ఇందులో భాగంగా రేపు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాబూరావు, కేంద్ర జలవనరులశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం పాల్గొననున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు…
కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చగా మారాయి.. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలపై ఆందోళన దేనికి అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దేశానికి ఏం కావాలో అది కేసీఆర్ చెప్పారన్న ఆయన.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యాయని విమర్శించారు.. ఇక, దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం అని మాత్రమే సీఎం కేసీఆర్ అన్నారని.. కేసీఆర్ మాట్లాడిన…
హైదరాబాద్ నగరం శివారులోని ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకల నేపథ్యంలో తపాలా శాఖ ప్రత్యేకంగా పోస్టల్ కవర్‌ను రూపొందించింది. ఈ మేరకు తపాలా శాఖ ముద్రించిన పోస్టల్ కవర్‌ను చినజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం సమతా మూర్తి విగ్రహం ఎదుట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2,500 మంది కళాకారులు ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. మరోవైపు బుధవారం సాయంత్రం 5 గంటలకు సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలకు అంకురార్పణ జరిగింది.…
తెలంగాణలో ఇప్పుడు రాజకీయం మారిపోయింది.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని వదిలి.. ఇప్పుడు మొత్తం బీజేపీపై ఫోకస్ పెట్టారు గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. బీజేపీ వైపు తుపాకీ పెట్టి సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీని కాలుస్తున్నారని వ్యాఖ్యానించారు.. కేసీఆర్ తెలంగాణ లో రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాడన్న ఆయన.. చూసే వాళ్లకు అందరికి తుపాకీ ఎక్కుపెట్టిన దిక్కే కాల్చుతాడు అనిపిస్తుంది.. కానీ,…
సీఎం కేసీఆర్ నిన్న కేంద్రంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి సామ్రాట్ నీవు కేసీఆర్.. ప్రధానమంత్రి పై మాట్లాడే స్థాయి నీకు లేదని ఆమె అన్నారు. 12 వందల పిల్లల ప్రాణాలు తీసుకుని ఆ సీట్లో కూర్చున్నావ్.. కొంచం అన్నా సిగ్గు శరం లేదు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం ఏం పీకినవో చెప్పు అంతో ఆమె వ్యాఖ్యానించారు. నీ ఆలోచనే…
నదుల అనుసంధానం చేస్తామని బడ్జెట్ లో నిర్మల సీతారామన్ చెప్పారని, రాష్ట్రాల తో సంబంధం లేకుండా ఆమె ప్రకటించారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదు కానీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు నిధులు జారీ చేస్తుందని ఆయన అన్నారు.వాజపేయి ప్రధాని గా ఉండగా రాజ్యాంగం పై సమీక్ష కు 11 మందితో కమిటీ వేసింది. వెంకటచలయ్యా కమిషన్ వేసింది.. గోదావరి నది జలాలను కావేరి లోకి…
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలు వాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ఆయన స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు కోటి రూపాయల రివార్డును సీఎం కేసీఆర్ ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో మంగళవారం నాడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను సకిని రామచంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. Read Also: దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి: సీఎం కేసీఆర్ ఈ…
దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసం ఏం చేయాలో అంతా చేస్తానని…ఈ అంశంపై అందరినీ కలుపుకుని వెళ్తానని కేసీఆర్ చెప్పారు. దీనిపై కొద్ది రోజుల్లోనే అన్ని విషయాలు ప్రకటిస్తానని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్ అంటున్నారని… అయితే యూపీలో ఎవరు గెలిచినా ఈసారి బీజేపీకి సీట్లు అయితే తగ్గుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇది బీజేపీ పతనానికి నాంది పలుకుతుందన్నారు. దేశానికి కొత్త రాజ్యాగం కావాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం…