ఇంటిటికీ వెళ్లి హెల్త్ ప్రొఫైల్ తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ముందుగా ఈ కార్యక్రమం ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ మొదటి డోస్ లో భారత దేశం లో తెలంగాణ ముందు ఉందని, సౌత్ ఇండియా లో రెండు డోస్ లు వేసుకున్న జిల్లాలు గా కరీంనగర్, హన్మకొండ జిల్లాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చింది అంటే మనిషి చనిపోయాడు అనుకునే వారు.. ప్రపంచ…
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు సతీసమేతంగా దర్శించుకున్నారు. రఘునందన్ రావు దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాన్నిఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటిఆర్ నువ్వు సిరిసిల్ల, వేములవాడ రెండు కళ్ళు అన్నావ్, సిరిసిల్ల కి ఎన్ని నిధులు పోయాయి..వేములవాడ కి ఎన్ని నిధులు ఇచ్చారని ఆయన అన్నారు. అంతేకాకుండా వేములవాడ…
భారత రాజ్యాంగాన్ని తిరగరాయడంపై తాను చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు గురువారం అల్టిమేటం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం దళితుల కుటుంబానికి 10 లక్షలు ఇస్తుందని చెప్పారు. వారు అణగారిన వారు మరియు సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నందున అతను ఇస్తున్నాడు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించారు.…
హైదరాబాద్‌లో కాకుండా న్యూఢిల్లీలో ‘మిలియన్ మార్చ్’ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌వీ, టీఆర్‌ఎస్ యువజన విభాగం ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. తమ హయాంలో ఎన్ని ఖాళీలున్నాయో వెల్లడించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశంలోని అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి టైమ్ ఫ్రేమ్…
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమం వద్ద శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన రెండో రోజు ఉత్సవాలకు సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. తొలుత భారీస్థాయి ఏర్పాటు చేసిన శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీరామానుజచార్యుల విగ్రహం సమానత్వానికి ప్రతీకలాంటిదని తెలిపారు. దేవుడి ముందు ప్రజలందరూ సమానమే అన్నారు. రామానుజచార్యులు అందరినీ సమానంగా ప్రేమిస్తారని… మనం కూడా రామానుజ…
రాజ్యాంగం మీద ప్రమాణము చేసిన వ్యక్తి మాట మార్చడం అనేది సరి కాదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాజ్యాంగం వ్యతిరేకించిన వ్యక్తులు కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగం ద్వారానే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కొత్త రాజ్యాంగం కావాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాదన్నట్లే కదా అని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 65 సార్లు హై కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ…
కేసీఆర్ వాఖ్యల పై బీజేపీ నాయకులు చిల్లర మల్లారా మాటలు మాట్లాడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఒక్క సంక్షేమ పథకం ప్రవేశ పెట్టిందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మైన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల దళిత మహిళలపై అత్యాచారాలు చేసి చంపిన ఘటనలున్నాయని ఆయన ఆరోపించారు. బడ్జెట్ లో…
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కొత్తగా నిర్మించాల్సి వస్తే అంబేద్కర్ నే ప్రేరణగా తీసుకుంటారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చట్టాలు తేవాలన్నదే సీఎం ఆలోచన అని, బీజేపీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే రాజ్యాంగం పై చర్చ పెట్టండి అని ఆయన సవాల్ విసిరారు. స్వాతంత్రము వచ్చిన ఇన్నేళ్ల లో బడుగు బలహీన వర్గాలు జీవితాలు…
మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి కోరిక మేరకు మార్చి తర్వత మేడ్చల్ మండలంలో రూ. 10 కోట్లతో మరో 50 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రిని మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి అనుబంధంగా మరో కోటి రూపాయలతో ఎస్ఎన్సీయూ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఅర్…