తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. రేపో.. మాపో మరో 40వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. కొత్త జోనల్ విధానంతో యువతకు కావాల్సిన హక్కులు సాధించామని ఆయన తెలిపారు. మల్టీ జోనల్ విధానంతో కేవలం 5శాతం మాత్రమే నాన్ లోకల్ వారు మాత్రమే వస్తారని కేసీఆర్ పేర్కొన్నారు.
Read Also: బీజేపీ పాలన అంటే దేశాన్ని అమ్మడం.. మతపిచ్చి పెంచడం: కేసీఆర్
పరిపాలన గురించి తెలియని వారు సిగ్గు లేకుండా 317 జీవోను విమర్శిస్తున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. కొంతమంది స్వార్థపరులైన ఉద్యోగులు వాళ్లు లోకల్ కాకపోయినా తాము ఇక్కడే ఉంటామని అంటున్నారని… 317 జీవో గురించి మాట్లాడితే వారిని లాగి కొట్టాలని హితవు పలికారు. 317 జీవోతో స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.