సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో మార్పులు రావాలని వ్యాఖ్యానించారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై నిన్న బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. అంతేకాకుండా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడు అని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్ కు లేదని ఆయన మండిపడ్డారు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టిన దళితులే కేసీఆర్ ను కిందకు దించుతారని ఆయన అన్నారు. బండి సంజయ్ దెబ్బకు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చాడని, ప్రగతి భవన్ నుంచి ప్రజలు రోడ్డు మీదకు ఈడ్చుతారని కేసీఆర్ కు అర్థమైందని ఆయన విమర్శించారు. తిట్లు తిట్టడం ఎలా అనే పుస్తకాలను మాత్రమే కేసీఆర్ చదువుతాడని, బడ్జెట్ గురించి కాకుండా బీజేపీని తిట్టడం కోసమే కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతాడని రాజాసింగ్ ఎద్దేవా చేశారు.