ఇంటిటికీ వెళ్లి హెల్త్ ప్రొఫైల్ తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ముందుగా ఈ కార్యక్రమం ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ మొదటి డోస్ లో భారత దేశం లో తెలంగాణ ముందు ఉందని, సౌత్ ఇండియా లో రెండు డోస్ లు వేసుకున్న జిల్లాలు గా కరీంనగర్, హన్మకొండ జిల్లాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చింది అంటే మనిషి చనిపోయాడు అనుకునే వారు.. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజు కి క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు.. ప్రపంచ వ్యాప్తంగా 100 రకాలు క్యాన్సర్ లును గుర్తించారు.. 30 ఏళ్లుగా 50 శాతం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. క్యాన్సర్ పై ప్రజలు లో చైతన్యం, అవగాహన పెరగాలని, రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ లు ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ లో సిబ్బంది కి శిక్షణ ఇస్తున్నామని, తెలంగాణ లో22 శాతం కేసులు నోటి క్యాన్సర్, 13 శాతం బ్రెస్ట్ క్యాన్సర్, 12 శాతం గర్భాశయ క్యాన్సర్ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాలలో క్యాన్సర్ మొబైల్ స్క్రీనింగ్ బస్సులు అందుబాటులోకి తెస్తాన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఆరోగ్య శ్రీ ద్వారా ఏడాదికి ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేస్తుందని, క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించాలని, ఏడాదికి ఆరోగ్య శ్రీ ద్వారా 15 వేలు మంది క్యాన్సర్ పేషంట్ లుకు ట్రీట్మెంట్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలో వరంగల్ హెల్త్ సిటీ లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అందిస్తామని, జిల్లా హాస్పిటల్స్ లో త్వరలో కీమోథెరపీ, రేడియో థెరఫీ సేవలు అందిస్తామన్నారు.