బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కొత్తగా నిర్మించాల్సి వస్తే అంబేద్కర్ నే ప్రేరణగా తీసుకుంటారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చట్టాలు తేవాలన్నదే సీఎం ఆలోచన అని, బీజేపీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే రాజ్యాంగం పై చర్చ పెట్టండి అని ఆయన సవాల్ విసిరారు. స్వాతంత్రము వచ్చిన ఇన్నేళ్ల లో బడుగు బలహీన వర్గాలు జీవితాలు ఎందుకు మార్పు రాలేదని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ ను అవమానపరిచిన వాళ్ళు ఆయన గురించి మాట్లాడుతున్నారని, బడ్జెట్ అందరిని అవమానపరిచే విధంగా ఉందని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ విలువలకు కేంద్రం తూట్లు పొడుస్తుందని ఆయన ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు హక్కులు ను కాలరేసే విధంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారని, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు భారత రాజ్యాంగం గురించి మాట్లాడలేదని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రతి పాదన కి ప్రధాన ప్రతి పక్షం కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని, అంబేద్కర్ స్పూర్తితోనే రాష్ట్రంలో పాలన సాగుతుందని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా అవసరం అయితే ఉద్యమం చేస్తామని, ఫెడరల్ స్ఫూర్తి కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ రాజ్యాంగాన్ని అవమానించారని ఆయన అన్నారు.