మహాత్మా గాంధీ చూపించిన బాటలో తెలంగాణ సీఎం కేసీఆర్ నడుస్తున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు 2001లోని ఓ పేపర్ క్లిప్పింగ్‌ను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. కరీంనగర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ‘కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం’ అంటూ అప్పట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి పత్రికలో వచ్చిన వార్తను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. ఆనాడు కేసీఆర్ అన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని.. కానీ ఆనాడు కేసీఆర్ చేసిన…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. శుక్రవారం నాడు జనగామలో కేసీఆర్ ఎందుకు బహిరంగ సభ పెట్టారో అర్ధం కావడం లేదన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నానని చెప్పడానికే కేసీఆర్ సభ పెట్టి ఉంటారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడతామని కేంద్రం ఎప్పుడు చెప్పిందని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి అని.. ఢిల్లీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీ…
సీఎం కేసీఆర్ నేడు జనగామ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. అయితే టీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభ ప్రజల పాలిట భయానక సభగా మారింది. ఎందుకంటే.. టీఆర్ఎస్ సభతో హైదరాబాద్ వరంగల్ హైవే పైనా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది. దారి లేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న…
జనగామలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో.. తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతారంటూ ప్రచారం జరిగింది.. దానికి ప్రధాన కారణం రాజ్యసభ వేదికగా మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలే కారణం.. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మాటల దాడికి దిగుతున్నారు.. అయితే, ఇవాళ కేంద్రాన్ని, ప్రధాని మోడీని, బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేసినా.. నరేంద్ర మోడీ చేసిన ఆ వ్యాఖ్యల జోలికి మాత్రం…
నేడు సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏడేళ్ల నుండి కేంద్రంతో ఏమైనా పంచాయితీ పెట్టుకున్నమా, నోరు కట్టుకొని పని చేసి ఇప్పుడిప్పుడే ఓ దారికి వస్తున్నామని ఆయన అన్నారు. వ్యవసాయని ప్రాధాన్యత పెరిగిందని, హైదరాబాద్‌కి వెళ్లిన వాళ్ళు గ్రామాలకు మళ్ళీ వస్తున్నారని, వ్యవసాయం ప్రాధాన్య పెరిగింది భూముల ధరలు పెరిగాయని ఆయన అన్నారు. రెండేళ్ల నుండి నరేంద్రమోదీ పంచాయితీ మొదలు పెట్టిండని, 2 ఏళ్ల…
ప్రధాని నరేంద్ర మోడీని దేశం నుంచి తరిమేస్తామంటూ హెచ్చరించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇచ్చారు.. జనగామలో జరిగిన గొడవపై స్పందిచిన కేసార్.. పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. బీజేపీ బిడ్డల్లారా మేం మంచివాళ్లం మిమ్మల్ని ఏమీ అనం.. కానీ, మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.. మా శక్తి ముందర మీరు ఎంత?…
ప్రధాని నరేంద్ర మోడీ జాగ్రత్త.. నీ ఉడుత ఊపులకు భయపడం అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్… జనగామ బహిరంగసభ వేదికగా.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు కేసీఆర్.. 8 ఏళ్లుగా పైసా ఇవ్వకపోయినా కేంద్రాన్ని ఏమీ అనలేదన్న ఆయన.. అడ్డగోలుగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు.. ఇప్పుడు విద్యుత్ సంస్కరణల పేరుతో కొత్త పంచాయితీ పెడుతున్నారు.. ప్రతీ మోటారుకు విద్యుత్ మీటరు పెట్టాలంటున్నారని ఫైర్ అయ్యారు.. కానీ,…
జనగామ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామ జిల్లా ఒకప్పుడు కరువుసీమగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని ఆయన అన్నారు. వచ్చే ఏడాదిలోగా అన్ని చెరువులు నింపుతామని, అలాగే జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ఆయన అన్నారు. పాలకుర్తిలో కూడా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ…
జనగామ కలెక్టరేట్ భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది… కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేతికి కొబ్బరికాయ అందించారు పూజారి.. ఆ వెంటనే.. తన పక్కనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి కొబ్బరికాయ ఇచ్చిన కేసీఆర్.. కొట్టాల్సిందిగా సూచించారు.. మొదట నిరాకరించినట్టుగానే కనిపించిన ఆయన.. మీరే కొట్టాలని కోరగా.. మరోసారి సీఎం సూచన చేయడంతో.. వెంటనే టెంకాయను కొట్టేశారు కోమటిరెడ్డి..…