తెలంగాణ సీఎం కేసీఆర్ జోకర్‌లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ చేసిన అనర్ధాలను ప్రధాని మోదీ వివరించే ప్రయత్నం చేస్తే… టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఇబ్బందేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే టీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తోందని నిలదీశారు. రాజ్యాంగంపై విమర్శలను డైవర్ట్ చేసేందుకే టీఆర్‌ఎస్ నిరసనలు చేపడుతోందని విమర్శించారు. రాజ్యాంగం విషయంలో కేసీఆర్ చేసిన వాఖ్యలపై బీజేపీ ఆందోళనలు…
ఏపీకి జరిగిన అన్యాయంపై అంతా గొంతెత్తుతున్నారు. ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ ముద్దాయిలే అన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కాంగ్రెస్ పార్టీ సరిగా చేయలేదని ప్రధాని అనడం తప్పించుకోవడానికి చేసిన కామెంట్లు. జరిగిన తప్పు మాది కాదంటే మాది కాదని ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ సమర్ధించకుంటే ఏపీ విభజన జరిగేదే కాదన్నారు మల్లాది విష్ణు. విభజన చట్టాన్ని అమలు చేయడం లేదు.. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు.…
తెలంగాణలో ఏర్పడిన కొత్త జిల్లాలో త్వరలోనే జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటుచేస్తామని, దీనిపై హైకోర్ట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.…
మోడీ కామెంట్లతో తెలుగు రాష్ట్రాలు హీటెక్కాయి. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్ళు పూర్తవుతున్నా మోడీ విభజనపై మంటలు రాజేశారు. పనిలో పనిగా కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు మోడీ. దీనిపై కాంగ్రెస్ నేతలు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలకు దిగారు. గాంధీ భవన్ ముందు ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పై మోడీ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు…
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి అని దుయ్యబట్టారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. పార్లమెంట్ కు రాని వ్యక్తి మోడీ. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని డ్రామాలు స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వు ఏం న్యాయం చేసావో చెప్పు అని ఆయన ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుంది. హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మోడీ తన స్వార్థానికి ఉపయోగించుకున్నారు. సమతామూర్తి కార్యక్రమాల్లో…
క్రమంగా కరోనా కేసులు దిగివస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవు అని ప్రకటించింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు… కోవిడ్ మూడో వేవ్ తెలంగాణలో ముగిసిపోయిందన్నారు.. థర్డ్ వేవ్ జనవరి 28న పీక్ చూశామన్న ఆయన.. ఆ తరవాత తగ్గుతూ వచ్చిందన్నారు.. పాజిటివిటీ రేట్ తగ్గింది… తెలంగాణలో 2 శాతం లోపే పాజిటివిటీ రేటు ఉందన్నారు.. ఇక,…
దక్షణాది రాష్ట్రాలపై నరేంద్ర మోడీ సర్కార్ వివక్ష చూపుతుందని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి… ఇక, ఉత్తరాది వారి పెత్తనం దక్షిణాదిపై ఎక్కువగా ఉందని.. అసలు వారి పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన గుత్తా… ఆర్థికాభివృద్ధి, జనాభా నియంత్రణలో దక్షణాది రాష్ట్రాలు ఉంటే.. కేవలం జనాభా పెంచడంపైనా ఉత్తరాధి రాష్ట్రాలు ఫోకస్ పెడుతున్నాయని విమర్శించారు.. ఏపీ పునర్:వ్యవస్థీకరణ చట్టానికి తూట్లు పడ్తుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి…
ఇటీవల సీఎం కేసీఆర్ రాజ్యాంగం చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొత్త రాజ్యాంగాన్ని ప్రతిపాదిస్తున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మోదీ ఆధ్యాత్మిక పురుషుడు.కేసీఆర్ చాలా తప్పులు మాట్లాడారన్నారు. ఆయన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆయన కొడుకుని, కూతుర్ని దింపేయమనండి రాజ్యాంగం మారిపోద్ది. ఫ్యామిలీ పార్టీలకు చెక్ పెట్టేందుకు రాజ్యాంగం రాసుకుంటూ పోతున్నాం అన్నారు. ఫ్యామిలీ పార్టీ లను భారతదేశంలో ఉంచం. ఆంధ్ర రాష్టంలో మేము, మా మిత్రపక్షం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక చేస్తున్నాం. రెండు యూనిట్ ల…