కాంగ్రెస్‌తో దోస్తీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ దస్తీ వేసిండు అని.. పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్… నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ముందుగా కేసీఆర్ బూతులు లేకుండా మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు.. అరిగి పోయిన రికార్డు లాగా కొత్త విద్యుత్ బిల్లు గురించి మళ్లీ మళ్లీ అవే అబద్దాలు ఆడుతున్నారని విమర్శించిన ఆయన.. విద్యుత్ డ్రాఫ్ట్ బిల్లులో మూడవ పేజీ క్లాజ్ 4.7లో…
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఆర్మీకి, సైనికులకు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… తెలంగాణ భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్నటి సీఎం కేసీఆర్ కామెంట్స్ పై కేంద్ర మంత్రులు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. జీవిత కాలం హిందూస్థాన్, పాకిస్థాన్.. అంతేనా అంటూ నిలదీసిన ఆయన.. పుల్వామా సర్జికల్ స్ట్రెక్స్ ని రాజకీయంగా మీరు వాడుకుంటున్నారు అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాఫెల్‌లో అవినీతి…
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతిలో కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ దామోదం సంజీవయ్య శత జయంతి సందర్భంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య చేసిన సేవలను శ్లాఘించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదం సంజీవయ్య ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారన్నారు చింతా మోహన్. వృధ్ధాప్య ఫించన్లు, అవినీతిపై ప్రత్యేక చట్టం, బలిజ ,కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన…
తెలంగాణ విషయంలో మోడీ వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయనే చెప్పాలి. తెలంగాణ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి, మానిక్కం ఠాకూర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. నాటిఉద్యమ నాయకులు , సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు. అహింసా మార్గంలో కేసీఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో…
రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, అతి త్వరలో అందరికీ ఇండ్లు అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఒక్క పైసా తీసుకోకుండా ప్రజలకు…
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలంతా అవసరమని కోరుకుంటే దేశంలో కొత్త పార్టీ పెడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జాతీయ పార్టీ పెడుతారా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఇలా సమాధానమిచ్చారు. కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు? పెడితే తప్పా? అని ప్రశ్నించారు. దేశంలో కొత్త పార్టీ పెట్టే దమ్ము తనకు లేదా అని నిలదీశారు. జాతీయ పార్టీ పెడితే తనను ఎవరు అడ్డుకుంటారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే ఏమైనా జరగవచ్చన్నారు.…
ఆదిలాబాద్ జిల్లా గూడెం వాసులు గుక్కెడు నీటికోసం తిప్పలు పడుతున్నారు..రోడ్డు సౌకర్యం లేక అల్లాడిపోతున్నారు..ఏళ్లు గడిచినా ఎవ్వరు పట్టించుకోకపోవడంతో గోస పడుతున్నారు ..చివరికి జిల్లా కలెక్టరేట్ కు మొరపెట్టుకోవడం కోసం గూడెం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు..అయినా స్పందించకపోవడం మూడు రోజులుగా కలెక్టరేట్ ముందు దీక్షకు దిగారు.. ఇదిగో ఇది ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండిషేక్ గూడెం ఇది.. గూడెం వాసులకు తాగునీటికోసం తంటాలుపడాల్సిన పరిస్థితి..ఊర్లో బోరు లేదు..పొలాల్లో ఉండే అల్లంతదూరంలోని బావి…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేయడం.. అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డిని మళ్లీ కేసీఆర్.. కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది.. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు రేవంత్…
తెలంగాణాకే తలమానికమైన మేడారం జాతరకు ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తొమ్మిది వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 400 సీసీ కెమెరాలతో నిత్యం పహారా కాయనున్నట్లు ఆయన తెలిపారు. క్రౌడ్ కంట్రోల్ నియంత్రణకు 33 డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 33 చోట్ల పార్కింగ్ స్థలాన్ని పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. 37…
హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ కార్పోరేటర్‌లు, ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మరో కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లడుతూ.. బీజేపీ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద పని చేయడం లేదని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రికి గౌరవంగా సమాధానం చెప్పుతామని ఆయన…