టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తామనే వార్తలు వస్తున్న వేళ పీకే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు రాష్ట్రపతి ఎన్నికలు, తెలంగాణలో పీకే టీం చేసిన సర్వే వివరాలను పీకే, సీఎం కేసీఆర్ కు అందించారు. దాదాపు 3 గంటల పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించేదుకు ఈ నెల 15న ఢిల్లీకి…
బీజేపీ నేత డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతోందని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలను కేసీఆర్ తుంగలో తొక్కి మరోసారి ఎన్నికల్లో ప్రజలను మోసగించేందికు సిద్దమవుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా,సంక్షేమ పథకాలను ప్రజలకు కార్యకర్తలు విధిగా తెలియజేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంతో పేదలు వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారని…
టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవటం..బీజేపీ గెలువటం ఖాయమని జోస్యం చెప్పారు. ఒకసారి టీఆర్ఎస్ ఓడిపోతే మళ్లీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. గోల్ మాల్ చేయాలనుకున్నప్పుడు..ప్రజలను తప్పుదోవ పట్టించాలన్నప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వస్తాడని విమర్శించారు. కేసీఆర్ కు నేను..నా కుటుంబమనే ఆహం పెరిగిందని అన్నారు.…
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్రయోజనాలకు పాకులాడే వ్యక్తి అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే విమర్శించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అక్కడే కేంద్ర పథకాల లబ్ధిదారులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటేరియట్ లేదు.. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు మహేంద్ర నాథ్ పాండే. ఇక్కడ గెలవలేని వారు జాతీయస్థాయిలో వెలుగుతారా.? అని ప్రశ్నించారు. ఆయనతో దేశం ఎలా ముందుకు వెళ్తుందని అడిగారు.…
రాబోయే ఏడాది మళ్ళీ ఎన్నికల సంరంభం ప్రారంభం కానుంది. కానీ గులాబీ నేతలు మాత్రం తమ మధ్య విభేదాలు వీడడం లేదు. పెద్దబాస్, చిన్నబాస్ ఎన్ని చెప్పినా ప్రగతిభవన్ లో విని వదిలేస్తున్నట్టు అనిపిస్తోంది. మొన్నటి వరకు రాజకీయంగా మాటల తూటాలు పేల్చుకున్న కొల్లాపూర్ నేతలు , ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో దూషించుకుంటున్నారు. ఇదంతా అధికార విపక్ష పార్టీ నేతల మధ్య అనుకుంటే మీ బిర్యానీలో కాలేసినట్టే. ఈ సీన్ అంతా అధికార టీఆర్ఎస్ లోనే కొనసాగుతుండటంతో…
సాధారణ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ పిద్ధాంతాలను ఒంట బట్టించుకున్న డా.కె.లక్ష్మణ్ సుదీర్ఘకాలం బీజేపీ కోసం పనిచేశారు. గతంలో బీజేపీ తరఫున ముషీరాబాద్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న లక్ష్మణ్ కు రాజ్యసభ పదవి దక్కింది. యూపీ నుంచి ఆయనకు బీజేపీ పెద్దల సభకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. గతంలో జీవీఎల్ నరసింహారావుకి యూపీ నుంచి ఎంపీగా అవకాశం ఇచ్చింది బీజేపీ. తాజాగా…
ఎంబీసీ కులాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఎం మత్స్య సంపద పేరుతో అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను కాంగ్రెస్ హయాంలో కేవలం ఎస్సిలకే పరిమితం చేసిందన్నారు. అంతేకాకుండా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను బీసీలకు కూడా కల్పించిందన్నారు. తెలంగాణలో బీసీ రుణాలు ఆటకెక్కాయి…
మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె జోగులాంబ గద్వాల జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ 8 ఏళ్ళ పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తుండటంతో అభివృద్ధి పనులకు భూమిపూజలు చేస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు. చిత్తశద్ధి ఉంటే అర్హులైన భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి మూడు సంవత్సరాలలో గట్టు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని సవాల్‌విసిరారు. గద్వాల నుంచి ఎర్రవల్లి వరకు ప్రభుత్వ భూమి ఉండగా 45…
రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి ప్రతిపక్షాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు ధీటుగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ వంటి నేతలు ఈ విషయంపై చర్చిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల గురించి మమతా బెనర్జీ ఢిల్లీలో సమావేశం నిర్వహించబోతున్నారు. జూన్ 15న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జాయింట్ మీటింగ్‌లో పాల్గొనేందుకు ప్రతిపక్ష సీఎంలకు లేఖ రాశారు. సీఎం కేసీఆర్ తో పాటు దేశంలోని ఎన్డీయేతర ముఖ్యమంత్రులు, ప్రధాన నాయకులకు ఫోన్లు చేస్తున్నారు మమతా బెనర్జీ.…
మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబ తాటాకు తప్పుళ్ళకు భయపడమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తానే పెద్ద నాయకుడిగా కేసీఆర్ ఊహించుకుంటున్నాడని, ఫాంహౌస్ లో కూర్చుని కేసీఆర్ కంటోన్న కలలు కల్లలుగా మిగిలిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సరిపోవటం లేదు.. దేశాన్ని పంచుకోవాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీని కేసీఆర్ పొగుడుతాడని ఎవరు అనుకుంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వ…