ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురువారం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలోని అంకమ్మ దేవాలయం నుంచి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా అంకమ్మ దేవాలయంలో ఆయన భార్య మల్లు నందిని భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామాల్లోని ప్రజలను పలకరిస్తూ వారి వ్యక్తిగత సమస్యలు వింటూ భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగిస్తున్నారు. KCR : తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా.?ఆ అవసరం…
తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారుతున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫార్మ్ హౌజ్ కే పరిమితం అవుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కార్యక్రమానికి హాజరైన సీతక్క టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీ అటవీ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చి పట్టాలు ఇస్తే నేడు ఆ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. స్థానిక సమస్యలను పట్టించుకోకుడా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో డబ్బాలు పలుకుతూ టైంను కేటాయిస్తున్నారని విమర్శించారు.…
జూబ్లీహిల్స్ అత్యాచార సంఘటన జరిగినప్పటి నుంచి ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేసిందని.. చట్టాన్ని కాపాడే వారే ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ స్పందించి ఆందోళన చేస్తే ఈ మాత్రం చర్యలైనా తీసుకున్నారని ఆయన అన్నారు. మొదటి నుంచి ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాని తనంలో ఉన్నారని విమర్శించారు. ఫార్మ్ హౌజ్ కే పరిమితం అయ్యారని…
గతంలో ఎవరైనా దళితుల అభివృద్ధి గురించి ఆలోచించారా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ.. హైదరాబాద్ కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిచి ఒట్టి చేతులతో పంపారని, నగర అభివృద్ధి కోసం నిధులిస్తే ప్రజలకు మేలు జరిగేదని విమర్శించారు. దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన…
*ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల,తిరుపతి పర్యటన. మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకోనున్న గవర్నర్ *నేడు పత్తికొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు *తిరుపతిలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి *మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుపతికి రానున్న సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ *నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకోనున్న జాతీయ హరిత…
పల్లె నిద్రలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని రంగాపూర్ గ్రామంలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు పరిశీలించిన ఆయన.. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామని.. ప్రతి ఊరికి మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్నామని చెప్పారు. దశలవారీగా అన్ని పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడం,…
తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం vs బీజేపీ వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే! కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో పనులన్నీ సవ్యంగా సాగుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. అసలు కేంద్రం రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు వారి వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. డప్పు కొట్టుకోవడం తప్పిస్తే, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని టీఆర్ఎస్ తిప్పికొడుతోంది. కానీ, బీజేపీ నేతలు…
జూబ్లీ హిల్స్ అత్యాచార ఘటనలో అరెస్ట్ అయిన నిందితులపై నార్కోటిక్ టెస్ట్ చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో వారిపై విచారణ జరిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ రేప్ కేసు నిందితులు ఈ ఒక్క ఘటన మాత్రమే కాకుండా మరెన్నో దారుణాలకి పాల్పడి ఉంటారని తాను అనుకుంటున్నానని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘మా నాన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల్లో ఉంటే మేమంతా సేఫ్’’ అనే భావనకు నేతల పిల్లలు వచ్చారని…
1. నేడు ఫ్రెంచ్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిల్ కోసం నాదల్‌తో రూడ్ తలపడనున్నాడు. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2. నేడు సీఎం కేసీఆర్‌ను జార్ఖండ్ సీఎం సొరెన్ కలువనున్నారు. ఈ సందర్భంగా జాతీయ ప్రత్యామ్యాయ రాజకీయ శక్తి అంశంపై చర్చించనున్నారు. 3. నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు జరుగనున్నాయి. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షకు 48,996 మంది అభ్యర్థులు హజరుకానున్నారు. 4. నేడు…
డబుల్ ఇంజన్ సర్కార్ కు మోడల్ ఉత్తర్ ప్రదేశ్ అని అన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారిగా లక్ష్మణ్ హైదరాబాద్ రావడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సన్మానించారు. యూపీలో 8 మందిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేస్తే అందులో నలుగురు ఓబీసీలు, ఇద్దరు మహిళలు, ఒక దళితుడికి అవకాశం కల్పించి సామాజిక న్యాయం చేశారని లక్ష్మణ్ అన్నారు. ఓబీసీ వర్గాలను బీజేపీ దగ్గర చేస్తా అని అయన అన్నారు. తెలంగాణపై…