పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి ఒప్పించాలిసింది పోయి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులుకు గురి చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గౌరవెల్లి ప్రజలు ప్రాజెక్ట్ కి సహకరిస్తామని చెప్పారని అయినా.. అర్థరాత్రి వందలాది మంది పోలీస్ లు ఇళ్ళ నుండి ఈడ్చుకొచ్చి విచక్షణ రహితంగా కొట్టారని ఆయన మండిపడ్డారు. నిర్వాసితులపై పోలీసుల లాఠీ ఛార్జీ దారుణమని, గతంలో కూడా రాత్రికి రాత్రే వీరిపై దాడి చేసి రోడ్ మీద పడేశారని ఆయన అగ్రహం…
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ, లబ్దిదారులకు దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మూడు కోట్లు మంజూరైనట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా గురుకుల పాఠశాలలో సుమారుగా నాలుగు లక్షల మంది పిల్లలు చదువుతున్నారని, 12 వందల కోట్లతో పాఠశాలకు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్య శాఖలో త్వరలో 20 వేల…
సిద్దిపేటలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8సంవత్సరాల ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని చాలామంది ఎదురు చూస్తున్నారని, నల్గొండ జిల్లాకు నేను వెళ్తే నాకు అక్కడ ప్రజలు బ్రహ్మరతం పడితే.. కేసీఆర్ చానెల్, పేపర్ ఖాళీ కుర్చీలు చూపించాయి.. ఆ చానెల్‌ని ఎవరూ చూడరు వారు తప్ప అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ…
ఆ రాజకీయ కురువృద్ధుడు టీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారా? కండువా మార్చేయడమే మిగిలిందా? గులాబీ గూటిలో ఆయనకు ఎక్కడ చెడింది? ఆయన పార్టీ మారితే లాభమెవరికి? నష్టమెవరికి? ఇంతకీ ఎవరా పెద్దాయన? మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పార్టీ మారతారా? గురునాథ్‌రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న ఆయన.. కారులో ఇమడ లేకపోతున్నారట. టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికారపార్టీలో ఆయన సీనియారిటీకి తగిన గుర్తింపు, ప్రాధాన్యం…
తెలంగాణ గురించి ఆలోచించకుండా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి కలలు కంటున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్. కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ కలలు కంటున్నాడు. కొందరు నిద్రలో కలలు కంటే ఇతను పగటి కలలు కంటున్నాడు. కేసీఆర్ కలలు నెరవేరవు. ఎనిమిదేళ్ళలో నీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? ఇన్ని రోజులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త హామీలతో ప్రజల ముందుకి కేసీఆర్ ఎలా వెళ్తాడని ప్రశ్నించారు తరుణ్ చుగ్.…
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్ లో తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ఆ పని చేసుకొచ్చి మీ ముఖం చూపియండంటూ ఆయన విమర్శలు గుప్పించారు.…
దేశంలోని పేద వాడికి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పధకం అమలు చేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ మండి పడ్డారు. మహబూబాబాద్ జిల్లా లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. భారత దేశం అన్ని మతాల కులాల వేదికగా నిలిచిందన్నారు. భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ దేశ సంపద అంతయు కొంతమంది చేతుల్లో పెడుతున్నారని మండి పడ్డారు.…
రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఓవైపు థర్డ్ ఫ్రంట్, కొత్త పార్టీ ఏర్పాటు వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తుంటే.. మరోవైపు.. ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడిపోయారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దీనికోసం ఈ నెల 15న ఢిల్లీ వేదికగా కీలక సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు పిలుపునిచ్చిన దీదీ.. తాను ఏర్పాటు చేసే సమావేశానికి రావాల్సిందిగా 22…
రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట మోగింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలులు (Schools) పునఃప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి. దీంతో విద్యార్థులు మళ్లీ పుస్తకాలు చేతపట్టుకుని హుశారుగా తరగతులకు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలను పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేశారు. కాగా.. స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నగరంలోని మెహబూబియా స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్ కమ్ చెప్పారు. అనంతరం సబితారెడ్డి…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై మంత్రి హరీష్ రావు కీలక కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిని పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని ఆయన అన్నారు. తాగునీరు, సాగునీరు, మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నామని.. విడిపోయి మన అభివృద్ధి చెందితే , వారు వెనుకపడి పోయారని అన్నారు. ఇతర రాష్ట్రాలకు పోయి చూస్తే మన తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో తెలుస్తుందని ఆయన అన్నారు. కేంద్రం అన్ని ప్రభుత్వం ఆస్తులను…