పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి(BRS) నిర్ణయించింది. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఈరోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
NVSS Prabhakar: తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పట్టారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రధాని రూ. 11 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించారు, ఇది కేసీఆర్ కు కంటగింపుగా ఉన్నట్లుంది, అందుకే కేసీఆర్ గైర్హాజరయ్యారని ఆరోపించారు.
అవినీతిని నేను ఒప్పుకోను.. అవినీతి పరుల పట్ల కఠినంగా వ్యవహరిద్దామా? వద్దా? అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రియమైన సోదర సోదరీ మణులారా.. మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.