రాయలసీమను తెలంగాణలో కలపాలంటూ పేర్కొన్నారు జేసీ.. రాయలసీమను తెలంగాణలో కలుపుకోవాల్సిన అవసరం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి ఉందన్నారు.
ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్‌ఎస్ మరో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్‌ఎస్ భారీ జనసమీకరణతో ప్రజలను, నేతలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
రాష్ట్రంలో అమిత్ షా టూర్ సక్సెస్ అయిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి తరుణు చుగ్ అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని వేల మంది బీజేపీ కార్యకర్తల్లో, రాష్ట్ర ప్రజల్లో బాగా జోష్ వచ్చిందని ఆయన అన్నారు.
యువకుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో మాట్లాడిన అమిత్ షా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బ్రిటీష్ ఎంపీ వీరేంద్ర శర్మ అభినందించారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.