సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 50మంది వికలాంగులకు హోండా స్కూటీలు పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష రూపాయలు విలువ గల వాహనాన్ని వికలాంగులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దేశంలో ఏ సీఎం ఇవ్వని విధంగా వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారన్నారు.
Also Read : Corona: వరుసగా ఐదవ రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు..
అవి పేరుకు మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్ లు అని ఆయన ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసే సొట్టకాయలకు నెత్తిమీద పొడిచినట్టు తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పాలన్నారు. దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరే రూ.3వేల16పెన్షన్ ఇస్తున్నారని హరీష్ రావు చెప్పారు. వికలాంగులు సకలంగులను పెళ్లి చేసుకుంటే డబుల్ కళ్యాణ లక్ష్మి పథకం వస్తుందని, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే మూడు లక్షలు వస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Also Read : Software Engineer : ఛీ దీనమ్మ జీవితం.. ఏడాదికి రూ.58లక్షల జీతం.. అయిన ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదు