తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మరో కొత్త మండలాన్ని ప్రకటించింది. కామారెడ్డి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. మాచారెడ్డి మండల పరిధిలోని పాల్వంచను కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
సీపీఐ ప్రజా పోరు యాత్రలో భాగంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంచిర్యాల తాండూరు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఐక్యతను సాధించడంలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నాడన్నారు. కేంద్రంతో కేసీఆర్ పోరాటం మంచిదే కానీ ముందుగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు.
నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూములపై బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేక రాశారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చౌటుప్పల్ ఆస్పత్రితో పాటు నియోజకవర్గంలోని 4 పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.