BRS Meeting: నేడు మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Meeting: ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్‌ఎస్ మరో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్‌ఎస్ భారీ జనసమీకరణతో ప్రజలను, నేతలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో నాందేడ్, కాందర్ లోహ సభలతో మహారాష్ట్ర రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు ఔరంగాబాద్ సభ కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఔరంగాబాద్ ఛత్రపతి శంభాజీనగర్‌లోని జబిందా మైదానంలో బీఆర్‌ఎస్ సభను నిర్వహిస్తోంది. ఇవాళ సభకు బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ హాజరకానున్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలు అక్కడ జనసమీకరణపై కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్, బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ సహా తదితరులు కొంతకాలంగా ఔరంగబాద్‌లోనే ఉండి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై నేడు హైకోర్టులో విచారణ
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
చాలా కాలం నుంచి మరాఠా ప్రజల్లో ఆలోచన రేకెత్తించిలా బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోంది. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ దృష్టి సారించింది. వివిధ పార్టీల నుంచి నేతలు చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ కేసీఆర్ సమక్షంలో 150 మందికి పైగా నేతలు బీఆర్ఎస్‌లో చేరనున్నారు. 30 మందికి పైగా ఛత్రపతి శంభాజీ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్స్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. 50 వేల మందితో మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ సభ కోసం ఏర్పాట్లు చేశారు. ఇవాళ్టి సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ప్రచారం నెలకొంది. గతంలో జాతీయ అంశాలపై ప్రస్తావించిన కేసీఆర్.. ఇవాళ్టి మీటింగ్‌లో అమిత్ షా ఆరోపణలతో పాటు మహారాష్ట్రలోని పరిణామాలపై మాట్లాడతారా? అనే చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!