వారిలా ఊగుతూ మనం మాట్లాడలేం.. వారిలా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం.. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం.. బూతులు మాట్లాడలేం.. వారిలా నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోలేం.. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థలను నాశనం చేయలేం.. రోడ్డుపైకి తీసుకురాలేం.. వారిలా అలాంటి పనులు మనం చేయలేం.. అవన్నీ వారికే పేటెంట్ అంటూ హాట్ కామెంట్లు చేశారు సీఎం వైఎస్ జగన్.
బడికి పిల్లలను పంపించేందుకు ఆ తల్లులకు ఇచ్చే ప్రోత్సాహకం ఇది... దేశంలో మరెక్కడా జరగటం లేదు... ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది అన్నారు సీఎం జగన్.. నాలుగేళ్లలో రాష్ట్రంలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని వెల్లడించారు.. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందులో భాగంగా పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహిస్తాం అని తెలిపారు
ఆంధ్రప్రదేశ్ లో నీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. HOD కార్యాలయాలు మరియు సెక్రటేరియట్, హైకోర్టు అలాగే అసెంబ్లీ వంటి విభాగాల లో పని చేస్తున్న ఉద్యోగులకు 5 రోజులు పనిచేసే విధానాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది..ఈ విషయం పై జరిగిన చర్చలో సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో నేడు ఉత్తర్వులు విడుదల చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30…
జనసేన అధికారంలోకి వస్తే బటన్ నొక్కడం ఉండదు.. రెల్లి కార్మికులు చెత్త ఊడ్చినట్టు అవినీతిని అంతం చేస్తామని జనసేన చీఫ్ అన్నారు. పులివెందుల రాజకీయం గోదావరి జిల్లాల్లోకి తీసుకు వస్తామంటే సహించేది లేదు అని పవన్ అన్నారు. అభివృద్ధి జరగాలంటే జగన్ పోవాలి అని ఆయన వ్యాఖ్యనించారు. సీఎంగా వున్న వ్యక్తి ఎలాంటి త్యాగాలు చేయలేదు అని పవన్ కల్యాణ్ అన్నారు.
డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ.. గత కొద్ది సంవత్సరాలుగా కోవిడ్ తో పాటు ఇతర కారణాలతో మూతపడ్డ కార్డియాక్ సర్జరీ విభాగం.. అనేక అవాంతరాలు దాటి నేటి నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో గుండె సర్జరీలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.