ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ.. క్రోసూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్.
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలకు మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. బీజేపీ కర్ణాటకలో కుక్క చావు చచ్చింది.. నడ్డా మర్యాదగా మాట్లాడి ఉంటే బాగుంటుంది.. అడ్డంగా ఉన్న నడ్డా చాలా మాట్లాడారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలోని విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త.. స్కూల్స్ ప్రారంభమైన రోజు నుంచే రాష్ట్రంలో విద్యా కానుక అందించాలని సర్కార్ డిసైడ్.. రేపటి నుంచి అన్ని పాఠశాలలో జగనన్న విద్యా కానుకను అందిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స.. సుమారు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద స్కూల్ డ్రెస్సులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బ్యాగ్, బెల్ట్, పుస్తకాలు అందజేత
విశాఖ వేదికగా జరగనున్న బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ సభకు ఆయన హాజరుకానున్నారు. రాత్రి 7 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 8 గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా అమిత్ షా సమావేశం కానున్నారు. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.