విశాఖలో చిక్కుకున్న ఎయిరిండియా ఫ్లైట్.. NTV కథనానికి స్పందన
ఢిల్లీ నుంచి పోర్ట్ బ్లైర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.. వాతావరణం అనుకూలించని కారణంగా.. విశాఖలో నిన్న రాత్రి ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు పైలట్.. దీంతో.. ప్రయాణికులకు నిన్న రాత్రి ఒక హోటల్ లో వసతి ఏర్పాటు చేశారు.. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన నేపథ్యంలో.. పోర్ట్ బ్లైర్ వెళ్లాల్సిన 270 మంది ప్రయాణికులు విశాఖపట్నంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
దీంతో ప్రయాణికుల ఇబ్బందులపై వరుసగా ప్రసారం చేసిన NTV కథనానికి ఎయిర్ ఇండియా అధికారులు స్పందించారు. విశాఖలో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అవ్వడంతో నిన్నటి నుంచి ఇబ్బంది పడిన సుమారు 270 మంది ప్రయాణికుల ఇబ్బందుల్ని కళ్ళకి కట్టినట్లు NTV న్యూస్ ఛానెల్ చూపించింది. దీంతో మేఘాలయ హోటల్ నుంచి ప్యాసింజర్స్ ను ఎయిర్ పోర్ట్ కు తరలించారు. NTV కథనాన్ని చూసిన ఎయిర్ ఇండియా అధికారులు వెంటనే స్పందించి మొదట విడతగా 80 మందికి మధ్యాహ్నం 01:30 గంటలకి స్పెషల్ విమానంలో పోర్టు బ్లైర్ కి తరలించారు. మిగతావారిని నెక్స్ట్ ఫ్లైట్ లో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. హీరో కాలు తీసేసిన వైద్యులు
కన్నడ నటుడు సూరజ్ కుమార్ కు రెండు రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. సూరజ్ కుమార్ అలియాస్ ధృవన్.. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మైసూర్- గుడ్లపెట్ జాతీయ రహదారిలో బైక్ పై వెళ్తుండగా.. ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కాగా వెంటనే ధృవన్ ను దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఇక ఈ ప్రమాదంలో అతడి కుడి కాలు బైక్ కు లారీకి మధ్య ఇరుక్కొని నుజ్జు నుజ్జు కావడంతో ఆ కాలును తీసివేశారని తెలుస్తోంది. ప్రాణాలకు అయితే ప్రమాదం లేదని, కాలు మాత్రమే తీసేసినట్లు వవైద్యులు తెలిపినట్లు సమాచారం.
శ్రీ సిమెంట్ 23000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణ.. భారీగా పడిపోయిన షేర్లు..!
దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో శ్రీ సిమెంట్ ఒకటి. అయితే ఆ కంపెనీ రూ.23,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా సోమవారం కంపెనీ షేర్లు 10 శాతం పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి దాదాపు రూ.9200 కోట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేరు రూ.25 వేల స్థాయి నుంచి రూ.22 వేల స్థాయికి దిగజారింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.23 వేల స్థాయిలో ట్రేడవుతోంది. ఆదాయపు పన్ను శాఖ గత వారం సిమెంట్ తయారీదారులకు చెందిన ఐదు ప్రదేశాలను సర్వే చేసే ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా బీవార్, జైపూర్, చిత్తోర్‌గఢ్, అజ్మీర్‌లోని కంపెనీ స్థావరాలపై దాడులు జరిగాయి. గత రెండు ట్రేడింగ్ రోజుల్లో కంపెనీ షేర్లు 12 శాతానికి పైగా క్షీణించాయి.
ధోనీ కాదు, అసలైన కెప్టెన్ కూల్ అతడే.. లిటిల్ మాస్టర్ ఫిట్టింగ్
కెప్టెన్ కూల్ ఎవరని ప్రశ్నిస్తే.. చిన్న పిల్లలు సైతం ఠక్కున టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్తారు. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నా, ఆటగాళ్లు ఏదైనా తప్పు చేసినా.. అతడు ఆవేశం కోల్పోడు. టెన్షన్‌గా కూడా కనిపించడు. చాలా కూల్‌గా పరిస్థితుల్ని హ్యాండిల్ చేస్తాడు. ఇలా తన కూల్ కెప్టెన్సీతోనే.. అతడు భారత జట్టుకి ఎన్నో మరుపురాని విజయాల్ని అందించాడు. అతనికి కోటానుకోట్ల అభిమానులు ఉండానికి కారణం.. అతని కూల్ కెప్టెన్సీనే కారణం.
అయితే.. లిటిల్ మాస్టర్‌గా పేరొందిన భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం ధోనీ ‘కెప్టెన్ కూల్’ కాదంటూ కుండబద్దలు కొట్టాడు. భారత్‌కు తొలి వరల్డ్‌కప్‌ను అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసలైన ‘కెప్టెన్ కూల్’ అని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ 25వ తేదీ నాటికి 1983 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని 40 ఏళ్లు పూరైన సందర్భంగా.. గవాస్కర్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన.. తన దృష్టిలో కెప్టెన్ కూల్ ధోనీ కాదని, ఒరిజినల్ కెప్టెన్ కూల్ కపిల్ దేవ్ అని పేర్కొన్నాడు. కపిల్ దేవ్ ఒక డైనమిక్ లీడర్ అని, కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ అతనిలో పుష్కలంగా ఉండేవని కొనియాడాడు.
రేపు 5 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఏకకాలంలో 5 ”వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల”ను ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం ఐదు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు సోమవారం అధికారిక ప్రకటన తెలిపింది. ఉదయం 10:30 గంటలకు ప్రధాని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాలను కలుపుతూ వెళ్లే ఈ రైళ్లను మేక్ ఇన్ ఇండియా పాలసీలో భాగంగా ఐసీఎఫ్ నిర్మించింది. కొత్తగా మోదీ ప్రారంభించనున్న 5 రైళ్లు గోవా-ముంబై, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్‌పూర్, బెంగళూరు-హుబ్లి-ధన్వాడ్ రూట్లలో నడుస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టే ఐదు రైళ్లతో కలిసి దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరనుంది.
టమోటాలతో పాటు వాటి ధరలు కూడా పెరిగాయి.. ఎంత పెరిగాయో తెలుసా..!
వర్షాకాలం ప్రారంభమవగానే కూరగాయల రేట్లకు అమాంతం రెక్కలు వచ్చాయి. గత వారం రోజుల్లోనే టొమాటోలతో సహా పలు కూరగాయలు ధరలు పెరిగాయి. అంతేకాకుండా పప్పుల ధరలు నింగికంటాయి. మరోవైపు కందిపప్పు ధరలు భారీగా పెరగడంతో.. జనాలు వాటిని తినడమే మానేశారు. ఇప్పుడు కందిపప్పు ధర ఆకాశానికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా కందిపప్పు ధరలో రూ.40 పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఒక కేజీ కందిపప్పు ధర 160 నుండి 170 రూపాయలకు పెరిగింది. దీంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు కూరగాయలలో టమాటా అత్యంత రేటు పలుకుతుంది. రిటైల్ మార్కెట్‌లో కొద్దిరోజుల క్రితం కిలో రూ.20 నుంచి 30 వరకు విక్రయించగా.. ఇప్పుడు రూ.80 నుంచి రూ.120కి పెరిగింది. దోసకాయ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. మార్కెట్‌లో గతంలో కిలో రూ.20 నుంచి 30 పలికిన దోసకాయ.. ఇప్పుడు రూ.40కి చేరింది. అదే విధంగా బెండకాయ ధర రూ.10 ఎగబాకగా.. ఇప్పుడు కిలో రూ.40కి విక్రయిస్తున్నారు. వారం క్రితం దీని ధర కిలో రూ.30 ఉండేది.
మధ్యప్రదేశ్‌లో వరుణుడి ప్రతాపం.. ఆరెంజ్ అలర్ట్ జారీ
మధ్యప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నప్పటికీ, మంగళవారం ఉదయం వరకు మధ్యప్రదేశ్‌లోని పలు ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. భారత వాతావరణ శాఖ ప్రకారం, తూర్పు మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలలో భారీ (64.5 మిమీ నుండి 115.5 మిమీ) నుంచి అతి భారీ (115.6 మిమీ నుండి 204.4 మిమీ) వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ హెచ్చరిక మంగళవారం ఉదయం వరకు చెల్లుబాటులో ఉంటుందని పేర్కొంది.
పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని పలు ప్రదేశాలలో కూడా మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక పేర్కొంది. సాగర్, నర్సింగపూర్, బేతుల్, మాండ్లా, సియోని, చింద్వారా, బాలాఘాట్, జబల్‌పూర్ జిల్లాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సీనియర్ వాతావరణ నిపుణుడు వేద్ ప్రకాష్ సింగ్ తెలిపారు. అశోక్ నగర్, భోపాల్, సెహోర్, విదిహా, రైసెన్, బుర్హాన్‌పూర్, రత్లాం, దామోహ్, ఛతర్‌పూర్, కట్నీ, షాహ్‌డోల్, అనుప్పూర్, సింగ్రౌలీ, సిధి, ఉమారియాలో మెరుపులతో కూడిన మోస్తరు వర్షం (15.6 మిమీ నుండి 64.4 మిమీ వరకు) పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. భారత వాతావరణ శాఖ సూచన ప్రకారం, షియోపూర్, శివపురి, గుణ, అగర్ మాల్వా, రాజ్‌గా, ఉజ్జయిని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షం (2.5 మిమీ నుండి 15.5 మిమీ వరకు) కురిసే అవకాశం ఉంది.
వర్మ ‘వ్యూహం’లో చిరు, పవన్.. ‘అల్లు’ వారిని కూడా వదలలేదుగా!
ఒకప్పుడు తెలుగులో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం వివాదాస్పద సినిమాలకు మాత్రమే పరిమితం అవుతున్నాడు. నిజానికి గత ఐదేళ్ల వ్యవధిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రల్ని పేరడీ చేస్తూ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేశారు కానీ అవి పెద్దగా జనాలకు కనెక్ట్ అవలేదు. అయితే ఇప్పుడు జగన్ ను హైలెట్ చేస్తూ ‘వ్యూహం’ అనే సినిమా అనౌన్స్ చేయడం, ఆ అనౌన్స్ చేసిన తరువాత సీఎం జగన్ ని రెండుసార్లు వర్మ కలవడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇందులో ఏదో కొత్తగా చూపించారనే అంచనాలు ఉండగా ఈ మధ్య విడుదలైన టీజర్ చూస్తే మాత్రం ఆ అంచనాలను నిలబెట్టుకోవడం కష్టమేనని తేలింది.
కోరిక తీర్చమని వివాహితని అడిగాడు.. దాబాకు తీసుకెళ్లి, మందు తాగిపించి..
అతడు వివాహితుడు, మంచి భార్య ఉంది. అయినా మరో వివాహితపై కన్నేశాడు. ఆమెతో కామవాంఛ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఆమె వద్దకు వెళ్లి, తన కోరిక తీర్చమని అడిగాడు. ఆ తర్వాత అతడు శవమై కనిపించాడు. తన భార్యపైనే కన్నేస్తావా? అంటూ ఆమె భర్త ఆ వ్యక్తిని కిరాతకంగా హతమార్చాడు. పక్కా స్కెచ్ వేసి మరీ హత్య చేశాడు. ఈ ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రమైన దౌల్తాబాద్‌కు చెందిన సీ శేఖర్(32) అనే వ్యక్తి హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ తన భార్య, పిల్లలతో ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన బీ గోపాల్ కూడా హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో కలిసి కూలి పనులు చేసుకునే వారు. దౌల్తాబాద్‌లో వీరి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి.
సీఎం జగన్ ను తలుచుకుంటేనే కొంతమందికి బిపి వస్తుంది..
రాష్ట్రంలో ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కరించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించినట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. అయితే, సీఎం జగన్ ను తలుచుకుంటేనే కొంతమందికి బిపి వస్తుంది అని ఆయన అన్నారు. బీపీ అంటే బాబు.. పవన్ అని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ కు నిర్దిష్టమైన ఆలోచన లేదు.. రాష్ట్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో బాబు, పవన్ లు గాడిదలు కాశారా.. ఓటు హక్కు ఉందో లేదో తెలియని వారే పవన్ సభలకు వస్తున్నారు అని ఎంపీ కామెంట్స్ చేశారు.
పవన్ సభలకు వచ్చే అలరి మూకలను చూసి సాధారణ ప్రజల ఇబ్బంది పడుతున్నారు అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. దత్తపుత్రుణ్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు. సీఎం జగన్ కేంద్రం నుంచి వంద శాతం నిధులు సాధిస్తున్నారు.. 2024 ఎన్నికల్లో దేవుడు కారుణించి కేంద్రంలో సీట్ల సంఖ్య వైసీపీకి అనుకూలంగా రావాలి అని మార్గాని భరత్ అన్నారు. కేంద్రంలో సీట్ల సంఖ్య మనకు అనుకూలంగా వస్తే ప్రత్యేక హోదా లభిస్తుంది అని పేర్కొన్నాడు.
కదులుతున్న రైలులో మైనర్ బాలికను వేధించిన నిందితుడు అరెస్ట్
గోవాలో కదులుతున్న రైలులో మైనర్ బాలికపై 37 ఏళ్ల వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు సోమవారం పోలీసులు సమాచారం అందించారు. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టీటీ) నుంచి కేరళలోని కొచ్చువేలికి రైలు వెళ్తుండగా ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుందని, గోవాలోని కొంకణ్ రైల్వే విభాగానికి చెందిన పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఉత్తర గోవాలోని పెర్నెమ్ సమీపంలో కదులుతున్న రైలులో నిందితులు బాలికపై వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. బాలిక తన కుటుంబంతో కలిసి మంగళూరుకు ప్రయాణిస్తోందని, పొరుగున ఉన్న మహారాష్ట్రలోని థానేలో నివసిస్తున్న నిందితుడు కూడా తన కుటుంబంతో కలిసి అదే రైలులో ఉన్నాడని అధికారి తెలిపారు.