Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 28 06 2023

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :June 28, 2023 , 9:00 pm
By Gogikar Sai Krishna
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. నలుగురు మృతి..

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది..అతి వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం లో నలుగురు మరణించగా పలువురికి తీవ్రగాయాలతో బయట పడ్డారు.. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం..

Also Read

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
  • Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!
  • Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
Add as a preferred
source on google

వివరాల్లోకి వెళితే..హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలోని రాంపూర్ లో బుధవారం ఉదయం ఓ కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఓ బాలిక కూడా ఉంది. అయితే ఆ కారు భద్రాష్-రోహ్రు లింక్ రోడ్డులో షాలున్ కైచీ సమీపానికి చేరుకోగానే ఓ లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ లోపు స్థానికులు కూడా అక్కడికి వచ్చారు. ఇక స్థానికుల సాయంతో కారులో ఇరుక్కొని ప్రాణాలతో ఉన్న బాలికను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారని పోలీసులు గుర్తించారు..ఈ ప్రమాదం లో గాయపడిని బాలిక పరిస్థితిని అబ్జెర్వేషన్ లో ఉన్నట్లు సమాచారం.. ఒకేసారి కుటుంబంలో నలుగురు పోవడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.. బాలికను చూసి కంటతడి పెడుతున్నారు

ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా.. ‘బ్రో’ రేపు వస్తున్నాడట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా సముతిరఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. నిన్న ఒక మాస్ పోస్టర్ ను రిలీజ్ చేసి టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. నేడు టైమ్, డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 29 సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మా అన్న చనిపోయేంత పిరికివాడు కాదు.. కంటతడి పెట్టిస్తున్న శ్యామ్ చెల్లి మాటలు

ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మృతి రాజకీయ రంగును పులుముకుంటున్న విషయం కూడా తెల్సిందే. శ్యామ్ మృతిపట్ల చాలా అనుమానాలు ఉన్నాయని, పోలీసులు విచారణను వేగవంతం చేయాలనీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. జీవితం మీద విరక్తితో శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలుపుతున్నారు. అయితే అందులో నిజం లేదని, అతని డెడ్ బాడీ ని చూస్తుంటే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. ఇక సహాయం మృతిపై ఎన్టీఆర్ సైతం స్పందించాడు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. శ్యామ్ చెల్లెలి బాధ్యత తీసుకున్న విషయం కూడా తెల్సిందే. ఇక తాజాగా తన అన్న మృతిపై శ్యామ్ చెల్లెలు ఎమోషనల్ అయ్యింది. తన అన్న చనిపోయేంత పిరికివాడు కాదని చెప్పుకొచ్చింది.

ఆగస్టు 10 లోపు “ఆదిత్య-ఎల్1” ప్రయోగం.. ఇస్రో చీఫ్ క్లారిటీ..

సూర్యుడి అధ్యయనం కోసం భారత అంతరిక్ష సంస్థ, ఇస్రో ఆదిత్య-ఎల్1 అనే మిషన్ ను చేపడుతోంది. ఈ ప్రయోగం ఇస్రోకు ఎంతో కీలక కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య-ఎల్1 ప్రయోగం ఎప్పుడుంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ సమాధానం ఇచ్చారు. శాటిలైట్ ని ఇంటిగ్రెట్ చేశామని, పేలోడ్స్ ని వివిధ ఏజెన్సీలు అభివృద్ధి చేస్తున్నాయని, ఇది శాటిలైట్ సెంటర్ కి చేరుకున్నాయని, పేలోడ్స్ ని శాటిలైట్ ని అనుసంధానించే ప్రక్రియ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ప్రయోగానికి ముందు వరసగా కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ఆదిత్య-ఎల్ 1ని పీఎస్ఎల్వీ నుంచి ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 10లోపు ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సోమనాథ్ అన్నారు.

రాకేష్ మాస్టర్ పేరిట జాతీయ పురస్కారం

కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈనెల 18న అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన దశ దిన కర్మను నిర్వహించారు. శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ తమ సొంత ఖర్చులతో ఈ పెద్ద కర్మను జరిపి సంతాప సభ కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. సినీ రంగానికి చెందిన వెయ్యి మందికి పైగా ఈ పెద్ద కర్మలో పాల్గొని మటన్, చికెన్లతో ఏర్పాటు చేసిన విందు ఆరగించి వెళ్లారు. సంతాప సభ, పెద్ద కర్మలో రాకేష్ మాస్టర్ భార్య, ఇద్దరు పిల్లలు కూడా పాల్గొనగా సినీ పరిశ్రమ నుంచి దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి హాజరయ్యారు. రామ్‌, ఇలియానాను హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి రూపొందించిన ‘దేవదాసు’ సినిమాకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇక రాకేశ్ మాస్టర్ ను ఎల్లకాలం గుర్తుంచుకునేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన శిష్యులు.

తెలంగాణ పథకాలు దేశం మొత్తం రావాలే

బీజేపీ, కాంగ్రెస్ లు దద్దమ్మ పార్టీ లే అని, దేశంను ముంచిన పార్టీలు అంటూ ధ్వజమెత్తారు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌లు దేశ ప్రజలను వంచించిన పార్టీలేనని ఆయన మండిపడ్డారు. మనం బాగుంటేనే కాదు దేశం బాగుండాలని ఆయన వ్యాఖ్యానించారు. 24 గంటల కరెంట్, తెలంగాణ పథకాలు దేశం మొత్తం రావాలే అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఆగకుండా జరగాలంటే పథకాలు అమలు కావాలంటే మళ్ళీ కేసీఆర్‌ సీఎం కావాలని, కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు నమ్మి తప్పిదారి ఓట్లు వేస్తే కర్ణాటక పరిస్థితి వస్తుందన్నారు.

ఫ్రాన్స్ జాతీయదినోత్సవానికి గౌరవ అతిథిగా ప్రధాని మోడీ.. పరేడ్‌లో పాల్గొననున్న రాఫెల్ జెట్స్

జూలై 14 ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ గౌరవ అతిథిగా హాజరుకాబోతున్నారు. పారిస్‌లోని చాంప్స్ ఎలిసీస్‌లో జరిగే బాస్టిల్ డే ఫ్లైపాస్ట్‌లో భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్ యుద్ధవిమానాలు పాల్గొనున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు జూలై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. అంతకుముందు, మాక్రాన్ ట్వీట్ చేస్తూ, ‘‘ప్రియమైన నరేంద్ర, గౌరవ అతిథిగా జూలై 14 పరేడ్ కి పారిస్‌కు మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.’’ అంటూ ట్వీట్ చేశారు.

రథయాత్రలో విషాదం.. ఎలక్ట్రిక్ వైర్ మీద పడటంతో ఆరుగురు మృతి

త్రిపుర రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. త్రిపురలోని ఉనకోటి జిల్లాలో ఇనుముతో చేసిన రథంపై ఎలక్ట్రిక్ వైర్ మీదపడటంతో ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉనాకోటిలోని చౌముహని ప్రాంతంలో ఉరేగింపు జరుగుతుండగా రథంపై ఎలక్ట్రిక్ వైర్ మీద పడింది. ఆ సమయంలో రథంపై కనీసం 20 మంది ఉన్నారు. కరెంట్ షాక్ తో ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో రథానికి కూడా మంటలు అంటుకున్నాయి. చాలా మంది వరకు గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. క్షతగాత్రులను కుమార్‌ఘాట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉనకోటి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

జగన్ ను ఇమిటేట్ చేసిన పవన్.. వీడియో వైరల్

ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్, సీఎం జగన్ మధ్య మాటల యుద్ధం మరింత ఘాటుగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక పవన్ వారాహి విజయ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. రెండు రోజుల క్రితమే ఆయన అస్వస్థతకు గురయిన విషయం తెల్సిందే. తన అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పవన్.. ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక మరోపక్క సీఎం జగన్.. పవన్ పై ఘాటు ఆరోపణలు చేసిన విషయం విదితమే. జ‌గ‌న‌న్న అమ్మ ఒడి ప‌థ‌కం నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మంలో భాగంగా కురుపాంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం జ‌గ‌న్, పవన్ పై విరుచుకుపడ్డారు.”ఆ ప్యాకేజీ స్టార్‌ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటాడు, తాట తీస్తానంటాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు మేము తిట్టలేము. ఆ మనిషి నోటికి అదుపు లేదు. అత‌నికి నిలకడ లేదు. పవన్ లా నాలుగేళ్ల‌కు ఒక‌రిని చొప్పున నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేము. పెళ్లి అనే ప‌విత్ర‌మైన దాన్ని రోడ్డున ప‌డేయ‌లేం.అవన్నీ వారికి చెందిన పేటెంట్ హక్కులే” అని జగన్ విమర్శించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balka Suman
  • big news
  • breaking news
  • cm jagan
  • Rakesh Master

తాజావార్తలు

  • Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్‌ను సున్నాకే పెవిలియన్‌కు పంపిన బౌలర్లు వీరే!

  • Lenin : అఖిల్ ‘లెనిన్’ మూవీలో స్పెషల్ రోల్ ?

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!

  • Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!

ట్రెండింగ్‌

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions