Shivam Dube: ప్రపంచకప్ హీరో సాహసం.. మాస్క్ ధరించి.. థర్డ్ ఏసీలో సామాన్యుడిలా ప్రయాణం! అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivam Dube: భారత క్రికెట్ జట్టు T20 ప్రపంచకప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడి చరిత్ర సృష్టించిన వేళ, టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబేకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో 24 పరుగులు పిండుకుని, భారత్‌ను విజేతగా నిలిపిన శివమ్ దూబే.. అహ్మదాబాద్ నుంచి ముంబైకి రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంలో దేశమంతా సంబరాలు చేసుకుంటుండగా, ఈ ‘వరల్డ్ కప్ హీరో’ మాత్రం తన కుటుంబాన్ని చేరుకోవడానికి పడ్డ తపన ఇప్పుడు చర్చనీయాంశమైంది.
READ ALSO: Nara Lokesh: ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ కలయిక.. రామ్మోహన్ నాయుడు ఇంట్లో లోకేష్ సందడి..
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
విమానంలో టిక్కెట్లు లేక.. రైలు ప్రయాణం
మ్యాచ్ ముగిసిన తర్వాత తన నాలుగేళ్ల కుమారుడు అయాన్, రెండేళ్ల కుమార్తె మహవిష్‌లను చూడటానికి దూబే ముంబై వెళ్లేందుకు విమాన టిక్కెట్లు ప్రయత్నించగా సీట్లు దొరకలేదు. రోడ్డు మార్గంలో వెళ్లడం కంటే రైలు ప్రయాణం వేగంగా ఉంటుందని భావించి, తన భార్య అంజుమ్‌తో కలిసి సయాజీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు.
గుర్తుపట్టకుండా జాగ్రత్తలు:
ప్రపంచకప్ గెలిచిన స్టార్‌ను రైలులో చూస్తే జనం ఎగబడతారని తెలుసు. అందుకే దూబే ఒక పక్కా ప్లాన్ వేశారు. ముఖానికి మాస్క్, తలపై టోపీ, ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్ ధరించి గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డారు. స్టేషన్‌లో రద్దీని తట్టుకోవడానికి, రైలు బయలుదేరడానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు కారు దిగి వేగంగా లోపలికి వెళ్లారు. ఆయనకు థర్డ్ ఏసీలో అప్పర్ బెర్త్ దొరికింది. ప్రయాణమంతా ఎవరికీ కనిపించకుండా అక్కడే ఉండిపోయారు. ప్రయాణంలో టికెట్ చెకర్ (TTE) వచ్చినప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. టికెట్‌పై పేరు చూసి.. “శివమ్ దూబేనా? అంటే ఆ క్రికెటరా?” అని టిటిఈ ఆశ్చర్యంగా అడిగారు. వెంటనే దూబే భార్య అంజుమ్ సమయస్ఫూర్తితో స్పందిస్తూ.. “కాదు కాదు.. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు?” అని బదులిచ్చి విషయాన్ని దాటవేశారు. అలా ఆ స్టార్ క్రికెటర్ తన గుర్తింపు బయటపడకుండా సురక్షితంగా ముంబై చేరుకున్నారు. “నా స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా ఆందోళన చెందారు. కానీ నా పిల్లలను చూడాలనే ఆత్రుతతో ఈ రిస్క్ తీసుకున్నాను. థర్డ్ ఏసీలో ప్రయాణం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది” అని శివమ్ దూబే తన ప్రయాణం గురించి పంచుకున్నారు.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!