Cardiac surgery: గుంటూరు జిల్లాలో ఇవాళ్టి నుంచి కార్డియాక్ సర్జరీలు పునః ప్రారంభమైయ్యాయి. ఏడు సంవత్సరాల క్రితం డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో గుండె మార్పిడి, గుండె శస్త్ర చికిత్స వైద్యం ప్రారంభమైనాయి. డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ.. గత కొద్ది సంవత్సరాలుగా కోవిడ్ తో పాటు ఇతర కారణాలతో మూతపడ్డ కార్డియాక్ సర్జరీ విభాగం.. అనేక అవాంతరాలు దాటి నేటి నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో గుండె సర్జరీలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Read Also: Floods: హిమాచల్ వరదల్లో 6గురు మృతి.. వందల సంఖ్యలో మూగజీవాల మృత్యువాత
ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం కోసం పేద ప్రజలు వస్తున్నారు.. వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. గతంలో ట్రస్ట్ సాయంతో హార్ట్ సర్జరీలు నిర్వహించేవారు.. ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్డియాక్ సర్జరీలు చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. గుంటూరులోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లు గుండె వైద్యానికి కేంద్రాలుగా ఏర్పడాలి అని వెల్లడించారు. అందుకోసం నా వంతు సహాయం ఏదైనా అందిస్తా అని డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే అన్నారు.
Read Also: Nabha Natesh: అబ్బా అనిపిస్తున్న నభా నటేష్ అందాలు.. క్లీవేజ్ ట్రీట్ తోపాటు థైస్ షో
కరోనా తర్వాత చాలా మందికి గుండె నొప్పితో పాటు గుండె మార్పిడి వంటి సమస్యలు తలెత్తున్నాయి. ఈ సమస్యను తొందరగా పరిష్కరించేందుకు సీఎం జగన్ సూచనలతో కార్డియాక్ సర్జరీలు చేస్తున్నామని డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన చికిత్సను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే పేర్కొన్నాడు.