1. అమరావతి : నేడు 108 అంబులెన్స్‌ల ప్రారంభోత్సవం. 145 వాహనాలను ప్రారంభించనున్న సీఎం జగన్. పాడైపోయిన వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు. రూ.34.79 కోట్లతో కొనుగోలు చేసిన ఏపీ సర్కార్.
2. నేడు న్యాయ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ భేటీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి తెచ్చే దిశగా కేంద్రం అడుగులు.
3. నేడు మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. 9 ఏళ్లలో సాధించిన ప్రగతి, సంక్షేమంపై చర్చ. మంత్రివర్గం నుంచి పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు స్పష్టం చేయనున్న మోడీ. కేబినెట్ నుంచి తొలగించిన వారికి పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చేయోచనలో అధిష్టానం.
4. నేడు హైదరాబాద్‌కు అఖిలేష్ యాదవ్. సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న అఖిలేష్. పట్నాలో ప్రతిపక్షాల భేటీకి హాజరుకాని బీఆర్‌ఎస్. ఈ నేపథ్యంలో ఆసక్తిగా మారిన ఇద్దరి భేటీ.
5. నేడు శరద్‌పవార్ అధ్యక్షతన ఎన్సీపీ కీలక సమావేశం.
6. తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్ష సూచన. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణ శాఖ.
7. నేడు గురు పౌర్ణమి సందర్భంగా మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముత్యాల పందిరి వాహనోత్సవం… వివిధ రాష్ట్రాలకు చెందిన 1200 మంది కళాకారులు 30 బృందాలతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు….
8. తూర్పుగోదావరి : నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా కేజీ రూ.50 లకు సబ్సిడీ పై టమాటా రైతు బజార్లు ద్వారా అమ్మకం.
9. నేడు సుప్రీంలో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ. తెలంగాణ హైకోర్టు అవినాష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడం పై సుప్రీంను ఆశ్రయించిన సునీత.. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఇదివరకే సుప్రీంను ఆశ్రయించిన సునీత..