నేడు ఏపీ సీఎ జగన్ 108 అంబులెన్స్‌లను ప్రారంభించనున్నారు. 145 కొత్త అంబులెన్స్‌లను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. పాడైపోయిన వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసిన ఏపీ సర్కార్.. వీటి కోసం రూ.34.79 కోట్ల ఖర్చు చేసింది. అయితే.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి సీఎం జగన్ అంబులెన్సులను ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీలో 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం రూ.188.56 కోట్లు వెచ్చిస్తోంది ఏపీ ప్రభుత్వం.
Also Read : PM Modi: ప్రధాని మోడీ ఇంటిపై డ్రోన్ కదలికలు.. దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు
2020లో ఏపీ ప్రభుత్వం రూ.96.50 కోట్లతో 412 అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే అప్పటికి ఉన్న వారికి రిపేర్లు చేయించింది. తద్వారా వాటి సంఖ్య 748కి పెరిగింది. 2022లో అక్టోబర్‌లో గిరిజన ప్రాంతాల కోసం మరో 20 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. తద్వారా మొత్తం అంబులెన్స్‌ల సంఖ్య 768కి పెరిగింది. ఇప్పుడు కొత్త వాటితో కలిపి ఈ సంఖ్య 914కి చేరనుంది. ఫలితంగా రాష్ట్రంలో ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్ ఉంది అని అంటున్నారు.
Sri Shiva Stotra Parayanam: సోమవారం నాడు ఈ స్తోత్రపారాయణం చేస్తే పరిపూర్ణ శివానుగ్రహం పొందుతారు