Warning : పెట్రోల్, గ్యాస్ కొరతపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశం. స్టాక్ బ్లాక్ చేస్తే అంతే..!
- ఇంధన కొరతపై పుకార్లకు కేంద్రం స్పష్టత
- పెట్రోల్, డీజిల్ అక్రమ నిల్వలపై కఠిన చర్యల హెచ్చరిక
- రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
- భారత్‌కు ముడిచమురు సరఫరా సజావుగా కొనసాగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడవచ్చనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెట్రోల్, డీజిల్ , ముడిచమురు సరఫరా విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Cooling Trick : చిన్న చిట్కాతో పాత కూలర్‌ను ఏసీలా మార్చుకోండి.. చిల్ అవ్వండి.!
Also Read
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సజావుగా సాగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేసింది. కేంద్ర హోం సెక్రటరీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ఇంధన అక్రమ నిల్వలు (Hoarding) , నల్లబజారును అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీలు, చీఫ్ సెక్రటరీలను కోరారు. గ్లోబల్ షిప్పింగ్ మార్గాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ, భారత్‌కు ముడిచమురు దిగుమతులు నిరంతరాయంగా అందుతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే చమురులో 70 శాతం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వస్తోందని, అదనపు కార్గో షిప్‌లు కూడా మార్గమధ్యంలో ఉన్నాయని ఆమె వివరించారు.
పుకార్ల కారణంగా ప్రజలు ఇంధనాన్ని భారీగా నిల్వ చేసుకునే అవకాశం ఉందని, దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితులను అరికట్టడానికి ప్రతి రాష్ట్రం ఒక అధికారిక ప్రతినిధిని నియమించి, ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచించింది. మీడియా సంస్థలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూడాలని కోరింది. మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం వల్ల విమాన రాకపోకలపై ప్రభావం ఉన్నప్పటికీ, దేశీయంగా ఇంధన అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, కాబట్టి వినియోగదారులు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!